Sunday, December 22, 2024

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలి మృతి

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి : బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గుర్తు తెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజ మల్లేష్ మరియు కానిస్టేబుల్ రవి పెట్రిలింగ్ నిర్వహిస్తున్నారు.

ఎప్రిల్ 11వ తేదిన రాయదుర్గం పరిధిలోని మల్కం చెరువు వద్ధ గుర్తు తెలియని వృద్ధురాలకి బైక్ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న వారు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు  మరణించినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలికి 60 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని, ప్రమాదానికి కారణమైన బైక్ నడుపుతున్న వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News