- Advertisement -
అంతర్గాం: మండలంలోని గోలివాడ గోదావరినది ఒడ్డుకు గుర్తు తెలియని వ్యక్తి శవం కొట్టుకువచ్చినట్లు అంతర్గాం ఎస్‌ఐ తెలిపారు. ఇతని వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, మృతునిపై నీలి రంటు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉందన్నారు. మెడలో నలుపు రంగు తయాత్తు, ఎత్తు సుమారు 5.4, రంగు చామన చాయ, నెరసిన గడ్డం, గుండ్రని ముఖంతో ఉందని ఆచూకీ తెలిసిన వారు 8712656527, 8712656524 నెంబర్‌లలో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు. శవాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి గదిలో భద్ర పరిచినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -