Friday, December 20, 2024

నార్సింగిలో గుర్తు తెలియని చిన్నారిని చేరదీసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద గుర్తు తెలియని చిన్నారిని పోలీసులు గుర్తించారు. రోడ్డుపై ఏడుస్తూ కనిపించిన బాలికను పోలీసులు చేరదీశారు. తన పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు హక్కున చేర్చుకొని భోజనం తినిపించారు. బాలికను అమీర్‌పేటలోని శిశువిహార్‌కు తరలించారు. బాలికకు గుండు ఉండడంతో ఏదైనా తీర్థ యాత్రకు వెళ్లి వస్తుండగా కుటుంబం నుంచి తప్పిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో మిస్సింగ్ వివరాలు తెలసుకొని పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చుతామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News