Saturday, December 21, 2024

అన్నోజిగూడ బస్సు స్టాప్‌లో గుర్తు తెలియని మృతిదేహం

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్ ః ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో మరణించిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ బస్సు స్టాప్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు స్టాప్‌లో అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని సదర్ వ్యక్తిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు పేర్కోన్నారు.

మృతుడు 34 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని, స్థానికులను విచారించగా గత రెండు సంవత్సరాలుగా పరిసరాలలో బిక్షమెత్తుకుండే వాడని పోలీసులు గుర్తించారు. మృతుడి నలుపు, పసుపు గీతలతో కూడిన టి షర్టు, నలుపు కలరు ప్యాంటు ధరించి, కుడి చేతుపై సూర్యుని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి దేహాన్ని గాంధీ మార్చురీకి తరలించినట్లు ఈ మేరకు కేసు నామోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని సిఐ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News