Sunday, January 19, 2025

దివ్యాంగురాలి అపహరణకు యత్నం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దివ్యాంగురాలి అపహరణకు యత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని చింతల్ మెట్ చౌరస్తా వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్యాంగురాలైన మహిళ ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా, బాధిత గట్టిగా అరించింది. దీంతో దుండగులు ఆమె నోట్లో గుడ్డలు పెట్టి అరవకుండా తీవ్రంగా కొట్టారు. మహిళ అరుపులను గమనించిన స్థానికులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకోవడంతో దుండగులు మహిళను సంఘటన స్థలంలోనే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయ పడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం 108 సమాచారం అందిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఆమెను స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా స్థానికంగా ఉన్న సిసి కెమెరాలో రికార్డైన విడియో పుటేజిని తీసుకెళ్లారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News