- Advertisement -
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, తొత్తినోని దొడ్డి గ్రామానికి చెందని భార్కి భీమన్నకు చెందిన 10 క్వింటాళ్ల మిర్చి బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. తనకున్న 3 ఎకరాల పొలంలో పండించిన మిర్చి పంటను మార్కెట్‌కు తీసుకువెళ్లేందుకు బస్తాల్లో నింపారు. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి గంట తర్వాత వచ్చి చూస్తే బస్తాలకు నిప్పంటుకుని మండుతున్నాయి. వెంటనే మంటలను ఆర్పగా అప్పటికే 10 క్వింటాళ్ల వరకు కాలిపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ఆర్థికంగా నష్టపోయిన తనను ఆదుకోవాలని కోరుతూ ఈ సంఘటనపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
- Advertisement -