Friday, April 4, 2025

మలక్‌పేటలో గుర్తు తెలియని మహిళ తల లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుర్తుతెలియని మహిళా తల లభ్యమైన సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….పిఎస్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఓ నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మలక్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎడిసిపి ఆనంద్, ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. మహిళ తలమాత్రమే బ్లాక్ కలర్ కవర్‌లో తీసుకుని వచ్చి పడేసినట్లు గుర్తించారు.

Also Read: మణికొండలో పేలుడు..

ఎక్కడో మహిళను హత్య చేసి ఇక్కడికి తలను తీసుకుని వచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తల పడేసిన వారిని పట్టుకునేందుకు, స్థానికంగా ఉన్న సిసిటివిలను పరిశీలిస్తున్నారు. మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు తలకు సబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఆమె గురించి తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News