Wednesday, January 22, 2025

ఉమ్మడి పౌర స్మృతి మంచి చర్య: జై రామ్ ఠాకుర్

- Advertisement -
- Advertisement -

Himachal CM Thakur

న్యూఢిల్లీ: యూనిఫాం సివిల్ కోడ్‌ను “మంచి చర్య”గా  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సోమవారం పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం దీనిని పరిశీలిస్తోందని, దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడో రాజకీయ పార్టీగా అవతరించడంపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. ”హిమాచల్ ప్రదేశ్ ప్రశాంతమైన రాష్ట్రం. ‘ఆప్’ రాజకీయాలు అక్కడ పనిచేయవు. మూడో ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రం అంగీకరించదు’’ అని హిమాచల్ భవన్‌లో విలేకరులతో అన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించిన ఆప్‌ పార్టీ నుంచి  అధికార బిజెపికి కొత్త సవాలు ఎదురవుతోందన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు చేయడానికి బిజెపి పాలిత ఉత్తరాఖండ్ సుముఖతపై వ్యాఖ్యానించమని అడిగినప్పుడు, ఠాకూర్, “యుసిసి ఒక మంచి చర్య. రాష్ట్రంలో దీనిని పరిశీలిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్‌లో దీనిని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News