Thursday, December 19, 2024

హైదరాబాద్‌లో యునిఫార్మ్‌ అండ్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ ఫెయిర్‌ 2022

- Advertisement -
- Advertisement -

Uniform & garments manufacturers fair 2022 in Hyd

న్యూఢిల్లీ: దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్‌ మహమ్మారి తీసుకువచ్చిన విరామం తరువాత 5వ ఎడిషన్‌ యునిఫార్మ్‌ అండ్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ ఫెయిర్‌ 2022 మరోమారు తిరిగి వచ్చింది. సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌జీఎంఏ) తరపున కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్‌ శాఖామాత్యులు శ్రీ నితిన్‌గడ్కరీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఐదవ ఎడిషన్‌ ఫెయిర్‌ డిసెంబర్‌ 07, 08, 09 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వద్ద జరుగనుంది.

ఈ ఫెయిర్‌కు సంబంధించిన టీజర్‌ విడుదల చేసిన అనంతరం గడ్కరీ మాట్లాడుతూ ‘‘యూనిఫార్మ్‌ గార్మెంట్‌ తయారీదారులు, యూనిఫార్మ్‌ ఫ్యాబ్రిక్‌ తయారీదారులు, యూనిఫార్మ్‌ యాక్ససరీల తయారీదారులు ఈ షోలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం దేశంలో దీనిని సమాంతరంగా లభ్యమవుతున్న మరో వేదిక ఉన్నట్లుగా నాకు తెలియదు. సోలాపూర్‌ గార్మెంట్‌ అసొసియేషన్‌ ను అభినందిస్తున్నాను. దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఇది యూనిఫార్మ్స్‌కు సంబంధించి అతి పెద్ద వేదికగా నిలువనుంది’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ దేశం నుంచి మాత్రమే గాక ప్రపంచవ్యాప్తంగా తయారీదారులు ఈ ఫెయిర్‌లో పాల్గొనాల్సి ఉందన్నారు. యూనిఫార్మ్‌ విక్రయ రంగంలో ఉన్న లేదంటే ఈ రంగంలోకి అడుగిడదామనుకునే వారు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదర్శన ఇదన్నారు. ఈ సందర్భంలోనే ఐదేళ్ల క్రితం ఈ ఎగ్జిబిషన్‌కు రూపకల్పన చేసిన అప్పటి మహారాష్ట్ర టెక్స్‌టైల్‌ మంత్రి సుభాష్‌ దేశ్‌ముఖ్‌ను అభినందించారు. సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ గత ఆరు సంవత్సరాలుగా ఇండియాను యూనిఫార్మ్‌ సోర్సింగ్‌ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సుప్రసిద్ధ తయారీదారులు, డీలర్లు, హోల్‌సేలర్లు ఈ ఫెయిర్‌లో పాలుపంచుకోనున్నారు.

‘‘యునిఫార్మ్స్‌, ఫ్యాన్సీ గార్మెంట్స్‌, యునిఫార్మ్‌ ఫ్యాబ్రిక్‌ తయారీదారులు తమ ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఒకే చోట ప్రదర్శించనున్నారు. మహారాష్ట్రకు వెలుపల ఈ ఫెయిర్‌ నిర్వహిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని విజయ్‌ దకాలియా, డైరెక్టర్‌, సోలాపూర్‌ గార్మెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం బీ2బీ ఏరీనాను ప్రత్యేకంగా సందర్శక కొనుగోలుదారుల ప్రయోజనార్ధం ఏర్పాటుచేశాము. అలాగే సుప్రసిద్ధ మిల్స్‌ చేత నాణ్యత పట్ల ఎగ్జిబిటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులనూ ఏర్పాటుచేశాము’’ అని అన్నారు.

Uniform & garments manufacturers fair 2022 in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News