Wednesday, January 22, 2025

యూనిఫాం ఉద్యోగాలకు మరో రెండేళ్లు పెంచాలి

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ జెఎసి డిమాండ్

Medals for 13 policemen in Telangana
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు మూడేళ్లు సరిపోదని, మరో రెండు సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. నిరుద్యోగ జెఎసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 1 డిఎస్‌పి ఎత్తు 167.6 cm నుంచి యుపిఎస్‌సి నిబంధనలను అనుసరించి 165 cmకు కుదించాలని డిమాండ్ చేశారు. డిఎస్‌పి వయోపరిమితి 28 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గడ్డం శ్రీనివాస్, ఓయూ జెఏసి ఛైర్మన్ కొప్పుల ప్రతాప్‌రెడ్డి, కార్తీక్, హరీష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News