Saturday, January 18, 2025

గ్రేటర్ హైదరాబాద్ కు అంతరాయం లేని విద్యుత్తు!

- Advertisement -
- Advertisement -

క్షేత్ర స్థాయిలో సెక్షన్ అధికారులతో ఎఫ్‌వోసి విభాగం పనిచేసేలా ఆదేశాలు జారీ చేసిన సిఎండి

మన తెలంగాణ / హైదరాబాద్:  ప్రస్తుత వేసవి కాలంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగాక్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టిని పెట్టింది.ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంచింది. దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి విద్యుత్ సరఫరా వ్యవ స్థలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ప్రదానంగా డిస్కం పరిధి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇందులో పట్టణ ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సింహ భాగం ఉంది. ఇందులో తొమ్మిది సర్కిళ్లు పట్టణ ప్రాంతంలోనే ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వాటిపై వస్తున్న ఫిర్యాదులను సిఎండి వీడియో కాన్ఫరెన్స్ ల  ద్వారా పలుమార్లు సమీక్షించారు. ఇందులో మెట్రో జోన్‌లోని హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్ళలో విద్యుత్ సరఫరా, విద్యుత్ అంతరాయాల విషయంలో సెక్షన్ ఏఇలతో పాటు ప్యూజ్ ఆఫ్ కాల్ బృందాలు కలి పని చేయాలని సిఎండి ఆదేశించారు.

నగరంలో విద్యుత్ అంతరాయాలు తలతెత్తితో 1912కు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానికంగా ఉండే ప్యూజ్ ఆఫ్ కాల్(ఎఫ్‌వోసి)కు వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ ఫిర్యాదులపై సెంట్రల్ బ్రేక్ డౌన్( సిబిడి) విభాగానికి సమాచారం అందిస్తుంటారు. సిబిడి బృందాలు మూడు షిప్టులలో పని చేస్తుంటాయి. అంతరాయాలు ఏర్పడినప్పుడు వినియోగదారులు ఎఫ్‌వోసికి కాకుండా ఆపరేషన్ ఏఈకి ఫోన్ చేస్తే సీబీడీకి కాల్ చేయమం టారు. అది తమ పని కాదన్నట్లుగా ప్రవర్తి స్తుంటారనే ఫిర్యాదులను సిఎండి గుర్తించారు.ఇలాంటి సమస్యలు సర్కిల్, డివి జన్ తర్వాత ఉండే సెక్షన్ పరిధిలో తరచూ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. సిబిడిలు లేని శివారు ప్రాంతాల్లో ఎఫ్‌వోసిలకు ఆపరేషన్ ఏఇలు బాధ్యలుగా ఉన్నట్లే సిబిడిలు ఉన్న చోట సైతం బాధ్యత తీసుకోవాలని సిఎండి సెక్షన్ అధికారులను ఆదేశించారు. ఆ బాధ్యతలు తీసుకోమని చెప్పేవారు తప్పు కుంటే కొత్తగా వారికి బాధ్యతలు అప్పగిస్తా మని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ అంతరాయాలపై సంస్థకు చెందిన ఫోన్ నంబర్లకు ఫోన్ వచ్చినా స్పందించేందుకు కాల్ సెంటర్ ఉండగా, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News