Thursday, January 23, 2025

’24×7′ కరెంటు తీగలు ఖాళీగా లేవు

- Advertisement -
- Advertisement -

కరెంటు తీగలు ఖాళీగా లేవు

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోతలరాయుళ్లే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
గుజరాత్‌లోనూ, ఎపి నుంచి యుపి వరకు చీకట్లే

బొగ్గు కొరత పీడిస్తున్నా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అన్నింటినీ తట్టుకొని నిరంతర విద్యుత్‌తో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోంది. ముందుచూపు, దార్శనికత, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమయ్యిందని అధికారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పశ్చిమబెంగాల్,
మహారాష్ట్రలో
వ్యవసాయానికి
7గంటలే విద్యుత్
గుజరాత్‌లో 500
మె.వా.విద్యుత్ కొరత,
పరిశ్రమలకు పవర్
హాలీడే యుపిలో
రోజుకు 9 గంటలు,
రాజస్థాన్‌లో 8గంటలు,
చత్తీస్‌గఢ్‌లో 5-6
గంటల కోత ఎపిలో
7గంటలే సరఫరా

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటాయన్న సమైక్య పాలకుల విమర్శలకు ధీటుగా సమాధా నం ఇస్తూ నేడు తెలంగాణ విద్యుత్ కాంతులతో ప్రజ్వరిల్లుతోంది. యావత్ తెలంగాణకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో సిఎం కెసిఆర్ రూ పొందించిన ప్రణాళికలు నేడు వెలుగుజిలుగుల రాష్ట్రంగా అవతరించాయి. ఎపితో పా టు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెం ట్ కోతలతో ఆయా రాష్ట్రాల ప్రజలు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతుండగా సుమారు 9 గంటల పాటు అధికారికంగా, అనధికారికంగా కోతలు పెడుతుండడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు అక్కడి ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వచ్చినా కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోతలు లేని రాష్ట్రంగా ప్రస్తుతం తెలంగాణ నిలిచింది. విద్యుత్ శాఖలో విద్యుత్ లైన్‌లతో సహా ట్రాన్స్‌ఫార్మర్‌లను అధికంగా ఏర్పాటు చేసుకొని అంతేస్థాయిలో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తూ 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతోంది.

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 4 వేల మెగావాట్లు

తెలంగాణలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదకరస్థాయికి తగ్గకుండా జెన్‌కో చర్యలు తీసుకుంటుంది. సింగరేణి కాలరీస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం సౌరవిద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టి సారించింది. దీనిద్వారా అనతికాలంలోనే 4 వేల మెగావాట్లకు పైగా సామర్థ్యాన్ని పెంచుకుంది. వీటితోపాటు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ యాజమాన్యం జైపూర్‌లో నిర్మించిన రెండు 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ జెన్‌కో జలవిద్యుత్ కేంద్రాలు నీటి లభ్యతను బట్టి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సమగ్రచర్యల వల్లే దేశమంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడినా తెలంగాణలో మాత్రం ఆ సమస్య ఏర్పడడం లేదు.

ఐదేళ్లలో సుమారు రూ.9 వేల కోట్ల అదనపు సబ్సిడీ

పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రూ.35,968 కోట్లు ఖర్చుపెట్టాయి. పేద, గృహ, వ్యవ సాయ వినియోగదారులకు తక్కువ ధరలో విద్యుత్ అందించడం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.10 వేల కోట్ల సబ్సిడీని అందిస్తోంది. దీంతోపాటు ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.9 వేల కోట్ల అదనపు సబ్సిడీని చెల్లించింది.

దేశంలో 3.95 గిగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం

విద్యుత్ సంక్షోభం అంటే రోజువారీ విద్యుత్ వినియోగానికి, విద్యుత్ లభ్యతకు మధ్య వ్యత్యాసం పెరగడమే. ప్రస్తుతం దేశంలో గరిష్టంగా 2.07 గిగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. దేశంలో 3.95 గిగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉన్నప్పటికీ 2.07 గిగావాట్ల విద్యుత్‌ను కూడా సరఫరా చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం తమ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్, రైల్వే, బొగ్గు, మంత్రిత్వ శాఖలను సమన్వయపరచడంతో పాటు బొగ్గు ఉత్పత్తిని వీలైనంతగా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

గత అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా 108 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొరత

గత అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 108 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయి. బొగ్గు లభ్యత లేకపోవడంతో వివిధ రాష్ట్రాల్లోని 14,500 మెగావాట్ల సామర్థ్యం గల 15 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయినా బొగ్గు కొరత ప్రభావం పడకుండా మనరాష్ట్ర అధికారులు ముందుచూపుతో వ్యవహారించి నిరంతరం కరెంట్‌ను సరఫరా చేశారు.

ప్రస్తుతం మన దగ్గర రెండు వారాలకు సరిపడా నిల్వలు

రాష్ట్రంలోని తెలంగాణ జెన్‌కో, ఎన్టీపిసి, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సజావుగా విద్యుత్ ఉత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. కనీసం 15 రోజుల అవసరాలకు 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర రెండు వారాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా ఎపిలో రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారిక సమాచారం.

పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో వ్యవసాయానికి 7 గంటలే….

కేరళ ప్రభుత్వం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కేవలం 9 గంటల విద్యుత్‌నే సరఫరా చేస్తుండగా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఆయా ప్రభుత్వాలు వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే కరెంట్‌ను సరఫరా చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను ఇక్కడి ప్రభుత్వం అందిస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో పరిస్థితి ఇలా…..

1.గుజరాత్‌లో సుమారు 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా ఆ రాష్ట్రంలో వారానికి ఒకరోజు అక్కడి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించింది. వ్యవసాయానికి నిరంతరాయంగా రెండు నుంచి నాలుగు గంటల పాటు అనధికారికంగా కోతలు విధిస్తుండడంతో రైతులు పొలాల్లో పడిగాపులు కాస్తున్నారు.

2.దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన డబుల్ ఇంజన్ గ్రోత్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు 9 గంటల పాటు విద్యుత్ కోతలను విధిస్తున్నారు. ఇక్కడ సుమారుగా 300 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. ఏ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లేకపోగా నిరంతరం కోతలతో ఆ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

3.కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో 8 గంటల పాటు గృహ అవసరాలకు కరెంట్ కోతను విధిస్తుండగా వ్యవసాయ, పరిశ్రమలకు ఎప్పుడు కరెంట్ ఇస్తుందో, ఎప్పుడు తీసివేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆయా రాష్ట్రాల ప్రజలు పేర్కొనడం గమన్హారం.

4.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ సరఫరాకు సంబంధించి దయనీయ పరిస్థితి నెలకొంది. అక్కడ అప్రకటిత కోత 5 నుంచి 6 గంటల పాటు అన్నిరంగాల్లో కొనసాగుతోంది. ఇక్కడ విద్యుత్ డిమాండ్ సరఫరాకు మధ్య రోజురోజుకు అగాధం ఏర్పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

5.మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తుండగా అది కూడా ఆటంకాలతో సరఫరా చేస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటల పాటు అధికారికంగా గృహ అవసరాలకు కరెంట్ చేస్తూ పరిశ్రమలకు వారానికి ఒకసారి పవర్‌హాలీడేను ఎపి ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి ప్రస్తుతం విద్యుత్‌రంగం పురోగతి
విభాగం 2014 2022
1.స్థాపిత 7778 మెగావాట్లు 17,228 మెగావాట్లు
విద్యుత్ సామర్థ్యం

2.సోలార్ 74 మెగావాట్లు 4,512 మె.ట్లు

3.గరిష్ట డిమాండ్ 5,661 మె.ట్లు 14,160 మె.ట్లు

4.గ్రిడ్ వినియోగం 128 మి.యూ. 283.38 మి.యూ.

5.తలసరి వినియోగం 1196 కిలోవాట్లు 2012 కి.ట్లు.

టిఎస్ డిస్కంలు…
తెలంగాణ ఏర్పడేనాటికి 33 కేవీ సబ్‌స్టేషన్లు 2,138 ఉండగా అదనంగా 996 ఏర్పాటు చేయడంతో 3,166కి పెరిగాయి. లైన్ల పొడవు (99 కేవీ+ 11 కేవీ+ ఎల్టీ) 4.89 కోట్ల కిలోమీటర్లు ఉండగా, అదనంగా 1.42 కోట్ల కిలోమీటర్లు నిర్మించడంతో 6.31 కోట్ల కిలోమీటర్లకు చేరింది. పిటిఆర్ (పవర్ ట్రాన్స్‌ఫార్మర్)ల సంఖ్య 3,272 ఉండగా ప్రస్తుతం 5,613కి చేరాయి. డిటిఆర్ సంఖ్య 4.67 లక్షలు ఉండగా, అదనంగా 3.37 లక్షలు పెరిగి, 8.04 లక్షలకు చేరింది. గతంలో 1,11,00,000లు వినియోగదారులు ఉండగా ప్రస్తుతం 1,71,00,000 (యాబై లక్షలకు పైగా) వినియోగదారులు పెరిగారు.

పెరిగిన వ్యవసాయ సేవలు..

వ్యవసాయ సేవలు 2014లో 19.09 లక్షలుండగా, అదనంగా 6.6 లక్షలు (35 శాతం) పెరగడంతో ప్రస్తుతం 26.45 లక్షలకు పెరిగింది. మొత్తం సేవలు జూన్ 2014లో 1.11 కోట్లు ఉండగా అదనంగా 52 శాతం పెరగడంతో ప్రస్తుతం 1.71 కోట్లకు చేరుకున్నాయి.

టిఎస్ ట్రాన్స్‌కో

ఏడేళ్లలో టిఎస్ ట్రాన్స్‌కో పరిధిలో అనూహ్య వృద్ధి నమోదయ్యింది. ఎక్స్‌ట్రా హైటెన్షన్ లైన్ల పొడవు 16,379 కిలో మీటర్లు ఉండగా ప్రస్తుతం 27,375 కిలోమీటర్లు పెరిగింది. ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం తెలంగాణ ఏర్పడేనాటికి 14,979 మెగా వోల్ట్ ఆంపియర్ ఉండగా ప్రస్తుతం 38,426 ఎంవీఏకు చేరింది.
సబ్‌స్టేషన్లు 2014 2022 అదనం
400 కెవి 06 23 17
220 కెవి 51 98 47
132 కెవి 176 247 71
ఎక్స్‌ట్రా హైటెన్షన్ 233 368 135
(ఈహెచ్‌టిలు)

టిఎస్ జెన్‌కో ద్వారా 6,215 మెగావాట్ల….

టిఎస్ జెన్‌కో ద్వారా 6,215 మెగావాట్లతో 60.70 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, 39.28 శాతం హైడల్ విద్యుత్, మరో 0.02 శాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ తర్వాత తలసరి విద్యుత్ వినియోగంలో కేరళ నిలిచింది.

రాష్ట్రాల వారీగా తలసరి విద్యుత్ వినియోగం ఇలా….

దేశంలోనే అత్యధికంగా తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా 9.2 శాతం తలసరి విద్యుత్ వినియోగం అవుతోందని రాష్ట్ర అర్ధ గణాంకశాఖ తన నివేదికలో తెలిపింది. తెలంగాణ తరువాత కేరళ 9.1 శాతం, హిమాచల్ ప్రదేశ్ 7.7 శాతం, వెస్ట్ బెంగాల్ 7.7 శాతం, హరియాణా 7.1 శాతం, బీహార్ 6.8 శాతం, సిక్కిం 6.4 శాతం, పంజాబ్ 6.1 శాతం, గోవా 5.4 శాతం, కర్ణాటక 5.2 శాతంతో ఆయా స్థానాల్లో నిలిచాయి.

కరెంట్ బాగుంది.. నీళ్లు వస్తున్నాయ్
నాకు 3 ఎకరాల 5 గుంటలు భూమి ఉంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. రైతుబంధు ఇస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఏ సమస్యా లేదు.. గతంలో కరెంట్‌కు చాలా తిప్పలు ఉండే.
ఆంజనేయులు, రైతు
మాదారం, నారాయణ్ పేట్ జిల్లా

కరెంట్ సమస్య లేదు
నేను పండ్ల వ్యాపారం చేస్తు న్నా. చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలని టివిల్లో చూ స్తున్నాం. గతంలో ఇక్కడా ఉండేవి. కెసిఆర్ సిఎం అయిన తర్వాత కరెంట్ కోత లు అనేవే లేవు.
అబీబీన్ సలాం
పండ్ల వ్యాపారి, మహబూబ్ నగర్

ఆనందంగా ఉన్నాం
24 గంటల కరెంటు ఇవ్వడం తో రైతులమంతా చాలా సం తోషంగా ఉన్నాం. గతంలో వి ద్యుత్ కోతల తో మోటార్లు కా లిపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అయి, తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారం.
మూల ముసలయ్య యాదవ్,
రైతు, మిర్యాలగూడ

కోత అనేదే లేదు
ఏడేళ్లుగా ప్రభుత్వం నిరంత రం విద్యుత్‌ను అందిస్తోంది. ఇండస్ట్రీస్‌కు ఎంతో మేలు జ రుగుతున్నది. ఇండస్ట్రీ మోట ర్లు, ట్రాన్స్‌పార్మర్లు కాలిపోయే పరిస్థితిలేదు. సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు.
గౌరు శ్రీనివాస్, మిల్లర్స్ అసోసియేషన్
అధ్యక్షుడు, మిర్యాలగూడ

వ్యాపారానికి ఇబ్బందిలేదు
24 గంటలు కరెంటు ద్వారా కిరాణ షాపు నడుపుకునేందు కు ఇబ్బంది లేకుండా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలున్నా మనకా పరిస్థితి లే కుండా కెసిఆర్ ముందస్తు ఆలోచన బాగుంది.
వనమా మహేష్, కిరాణం వ్యాపారి,
మిర్యాలగూడ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News