Monday, December 23, 2024

సరూర్‌నగర్ రైతు బజార్ వద్ద యుబిఐ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) కోఠి రీజినల్ ఆఫీస్ వారు సరూర్‌నగర్ రైతు బజార్ వద్ద అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బ్యాంకింగ్ కార్యకలాపాలకు మార్కెట్‌తో ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ సేవింగ్ ఖాతాల ఓపెనింగ్, సౌండ్ బాక్స్ సౌకర్యంతో క్యూఆర్ కోడ్స్‌ల జారీ, 25 రైతులకు లావాదేవీల యాక్టివేషన్ చేపట్టారు. రీజినల్ హెడ్ కళ్యాణ్ వర్మ, రైతు బజాజ్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రవంతి రెడ్డి, ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, బ్యాంకు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపార కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల ప్రాధాన్యత, సౌలభ్యం గురించి బ్యాంకు అధికారులు సమావేశంలో వివరించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News