Friday, November 22, 2024

‘డిజిటల్’లో బడ్జెట్

- Advertisement -
- Advertisement -
union budget 2022-23
కరోనా దృష్టా బడ్జెట్ ముద్రణ కాపీలు తగ్గించిన ప్రభుత్వం
భౌతిక ముద్రణ కాపీలు కొన్నే అందుబాటులోకి
లాంఛన ప్రాయంగానే సంప్రదాయ ‘హల్వా వేడుక’

ముంబై : దేశీయ వార్షిక బడ్జెట్ ఈ సంవత్సరం కూడా పర్యావరణ హితంగానే ఉండనుంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశానికి చెందిన అనేక పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక ప్రకటనలు ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తారు. అయితే ఈసారి కూడా ఈ పత్రాల ముద్రణను తగ్గించడం ద్వారా ప్రభుత్వం పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తోంది. అంటే బడ్జెట్ పత్రాలు చాలా వరకు డిజిటల్‌గానే లభ్యం కానున్నాయి. భౌతిక ముద్రణ కాపీలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. వందలాది కాపీలను ముద్రించడం అనేది ఎంతో విస్తృతమైన కసరత్తుతో కూడిన పని, దీనికి గాను నార్త్ బ్లాక్‌లో ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణ సిబ్బంది కొన్ని వారాల పాటు నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. సంప్రదాయ ‘హల్వా వేడుక’ను ఆర్థికమంత్రి, ఉప ఆర్థికమంత్రి, సీనియర్ అధికారులు నిర్వహించిన తర్వాత ఈ ముద్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కాపీల ముద్రణను తగ్గించారు. మొదట జర్నలిస్టులు, బయటి విశ్లేషకులకు కాపీలను ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా లోక్‌సభ, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులకు కూడా అందించే కాపీలలోనూ కోత పెట్టారు. ఈ ఏడాది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల మరిన్ని ఆంక్షలు విధించారు. ఈ కారణంగా హల్వా వేడుకను లాంఛనప్రాయంగా నిర్వహిస్తే చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు మాత్రం డిజిటల్ బడ్జెట్ డాక్యుమెంట్ల కోసం కసరత్తు చేస్తూ ప్రత్యేక నిర్బంధంలో ఉంటారని తెలుస్తోంది.

బడ్జెట్ పత్రాల్లో ఏ అంశాలు ఉంటాయ్?

బడ్జెట్ పత్రాల్లో సాధారణంగా పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి ప్రసంగం, ముఖ్యాంశాలు, వార్షిక ఆర్థిక ప్రకటనలు, పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు, ఫైనాన్స్ బిల్లులో కేటాయింపులపై వివరణ, స్థూల ఆర్థిక నిబంధనల ప్రకటనలు వంటివి ఉంటాయి. ఇంకా దీనిలో మధ్యకాలిక ఆర్థిక విధానాలు, ఆర్థిక విధానాల వ్యూహాల ప్రకటన, పథకాలు, కస్టమ్ నోటిఫికేషన్లు, గత బడ్జెట్ ప్రకటనల అమలు, వసూళ్ల బడ్జెట్, వ్యయ బడ్జెట్, బడ్జెట్ అంచనా ప్రకటనలు కూడా ఉంటాయి. ఎంతో బరువుగా ఉండే బడ్జెట్ పత్రాలను కాటన్ సంచుల్లో పార్లమెంట్ వద్దకు తీసుకొస్తారు.

ఆర్థికమంత్రి చేతిలో టాబ్లెట్

2019 సంవత్సరంలో బడ్జెట్ సమర్పించేందుకు వచ్చే సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో బడ్జెట్ ప్రసంగం పత్రాలతో కూడిన ‘బహిఖాతా’ అనుకూల బ్రీఫ్‌కేస్ 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్ సందర్భంగా ఆమె చేతిలో టాబ్లెట్ ఉంది. ఎరుపు రంగు ‘బహిఖాతా’ వస్త్రంతో ఉన్న ఒక గాడ్జెట్‌ను మంత్రి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. 2022 ఫిబ్రవరి 1న నాలుగో బడ్జెట్‌ను ఆమె సమర్పించనున్నారు. అయితే సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు 10 రోజుల ముందు ‘హల్వా వేడుక’ నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News