Monday, December 23, 2024

రెండోసారి కరోనా కాలంలో నిర్మల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Union Budget 2022 to be presented on February 1 at 11 am

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ : కరోనా కాలంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఒక రోజు ముందు అంటే జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే సమయంలో జనవరి 31న మధ్యాహ్నం ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా కాలంలో సాధారణ బడ్జెట్‌ను సమర్పించడం ఇది రెండవసారి అవుతుంది. గత ఏడాది(2021)లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ సమయంలోనూ కరోనా తీవ్రత ఉంది. అప్పుడు కరోనాను దృష్టిలో ఉంచుకుని అనేక రకాల కేటాయింపులు చేశారు. అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి అనేక ముఖ్యమైన ప్రకటనలు కూడా చేశారు. ఈసారి కూడా కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం దృష్టా ఆర్థిక వ్యవస్థకు ఊతమందించే చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు ఈసారి సాధారణ బడ్జెట్‌పైనే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రంగానికి ఏం ప్రకటిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News