Thursday, December 26, 2024

జాతీయ విద్యా విధానం అమలుకు బడ్జెట్ ఎంతో మేలు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Union Budget 2022 will be of great help to Education: PM Modi

న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంతగానో తోడ్పడగలదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జాతీయ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వల్ల దేశంలోని విద్యా సంస్థలలో సీట్ల కొరత సమస్య తీరగలదని ఆయన స్పష్టం చేశారు. 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన సానుకూల ప్రభావాలపై సోమవారం ఒక వెబినార్‌లో ప్రధాని ప్రసంగిస్తూ విద్యారంగానికి సంబంధించి ఐదు అంశాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. నాణ్యమైన విద్యను అన్ని స్థాయిలలో అందచేయడం, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక-ఆకృతి, అంతర్జాతీయకరణ-ఎవిజిసి(యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కావిక్)పై ప్రధానంగా దృష్టిని నిమగ్నం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో డిజిటల్ కనెక్టివిటీ వల్లనే విద్యా వ్యవస్థ నిలిచిపోకుండా కొనసాగిందని ఆయన తెలిపారు. ఇ-విద్య, ఒక తరగతి ఒక చానల్, డిజిటల్ ప్రయోగశాలలు, డిజిటల్ యూనివర్సిటీ వంటి విద్యారంగ మౌలిక సదుపాయాలు యువజనులకు ఎంతో మేలు చేస్తాయని ఆయన చెప్పారు.

Union Budget 2022 will be of great help to Education: PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News