Monday, December 23, 2024

కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రధానాంశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రధానాంశాలు

కొత్త పన్ను వ్యవస్థలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు హెచ్చింపు
పింఛన్‌దారులకు కుటుంబ పింఛన్ నుంచి డిడక్షన్ రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంపు
కొత్త పన్ను వ్యవస్థలో పన్ను శ్లాబ్‌ల్లో మార్పు : రూ. 3, రూ.7 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం, రూ. 7, రూ. 10 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం, రూ. 10, రూ. 12 లక్షల ఆదాయానికి 15 శాతం
కొత్త పన్ను వ్యవస్థల వేతన ఉద్యోగి ఆదాయపు పన్నులో రూ. 17500 వరకు ఆదా చేసుకునే అవకాశం
మూడు క్యాన్సర్ ఔషధాలు -& ట్రాస్టుమాబ్‌డెరుక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వలుమాబ్ & పూర్తిగా కస్టమ్ సుంకం నుంచి మినహాయింపు
మొబైల్ ఫోన్, మొబైల్ ప్రింటెడ్ సర్కూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ), మొబైల్ చార్జర్‌పై కస్టమ్స్ సుంకం 15 శాతానికి తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతానికి, ప్లాటినమ్‌పై సుంకం 6.4 శాతానికి తగ్గింపు
సెక్యూరిటీస్ ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను వరుసగా 0.02 శాతానికి, 0.1 శాతానికి హెచ్చింపు
షేర్ల బై బ్యాక్‌పై వచ్చే ఆదాయంపై పన్ను గ్రహీత చేతుల్లోకి విధింపు
స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అన్ని తరగతుల మదుపరులకు ఏంజెల్ పన్ను రద్దు
విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గింపు
అప్పీల్‌లో పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024
పన్ను ట్రైబ్యునళ్లు, హైకోర్టులు, సుప్రీం కోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్ పన్ను సంబంధిత అప్పీళ్ల దాఖలకు ద్రవ్య పరిమితులు వరుసగా రూ. 60 లక్షలు, రూ. 2 కోట్లు, రూ. 5 కోట్లకు హెచ్చింపు
కొన్ని రకాల ఆర్థిక అసెట్లపై స్వల్ప కాలిక లాభాలపై 20 శాతం పన్ను
అన్ని ఆర్థిక, ఆర్థికేతర అసెట్లపై దీర్ఘ కాలిక లాభాలపై 12.5 శాతం పన్ను
లిస్ట్ అయిన ఈక్విటీల నుంచి రూ. 1.25 లక్షల వరకు దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు
ఇ కామర్స్ ఆపరేటర్లపై టిడిఎస్ రేటు ఒకటి నుంచి 0.1 శాతానికి తగ్గింపు.
స్టేట్‌మెంట్ దాఖలుకు గడువు తేదీ వరకు టిడిఎస్ చెల్లింపులో జాప్యం ఇక నేరస్థం కాదు.
తప్పించుకున్న ఆదాయం రూ. 50 లక్షలు, అంతకు మించి ఉంటేనే ఐటి మదింపును 3 ఏళ్లు నుంచి 5 ఏళ్లు వరకు తిరిగి తెరవవచ్చు.
సోదా కేసుల్లో కాల పరిమితి సోదా సంవత్సరం ముందు 10 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు తగ్గింపు
తక్కిన రంగాలకు విస్తరణ నిమిత్తం జిఎస్‌టిని సరళీకరించి, హేతుబద్ధం చేస్తారు
ఆర్థిక సంవత్సరం 2025లో జిడిపి 4.9 శాతంగా నిర్ధారించిన ద్రవ్య లోటు తదుపరి సంవత్సరంలో 4.5 శాతంలోపునకు తగ్గింపు
వికసిత్ భారత్ లక్షం సాధనలో తయారీ, సేవలతో సహా 9 ప్రాధాన్య రంగాలను, వచ్చే తరం సంస్కరణలను బడ్జెట్ సూచించింది
ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఇ, మధ్య తరగతిపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయింపు
ఆర్థిక సంవత్సరం 2025లో క్యాపెక్స్ రూ. 11.11 లక్షల కోట్లుగా నిర్ధారణ
బీహార్‌లో కొన్ని నీటిపారుదల, వరద నివారణ ప్రాజెక్టులకు రూ. 11500 కోట్ల మేరకు ఆర్థిక సహాయం
బహుళపక్ష అభివృద్ధి సంస్థల ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 15 వేల కోట్ల మేరకు ప్రత్యేక ఆర్థిక సహాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News