- ఉద్యోగాల సృష్టి.. వ్యవసాయ పుష్టికి ప్రాధాన్యం
- మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట
- పట్టణ, గ్రామీణ పేదల సొంతింటి కలకు చేయూత
- మహిళల పేరిట ఆస్తులు కొనుగోలుకు ఊతం
- ముద్ర రుణాలు పెంపు కొత్తగా భూ ఆధార్.. రికార్డుల డిజిటలైజేషన్
- రూ.3లక్షల వరకు జీరో ట్యాక్స్
- స్థిరాస్తి అమ్మకందారులకు షాక్.. లాభాలపై 12.5శాతం పన్ను
న్యూఢిల్లీ : కొత్త మిత్రపక్ష ధర్మంగా మంగళవారం 202425 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. ఇందులో మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు పన్ను రాయితీలు కల్పించారు. దేశంలోని యువతను దృష్టిలో పెట్టుకుని రూ 2 లక్షల కోట్ల కేటాయింపులతో ఉద్యోగ పథకాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఉద్యోగాల సృష్టికి ఈ ధనం వినియోగించుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈసారి బడ్జెట్‌లో కొట్టొచ్చిన కీలక విషయం మోడీ 3.0 ప్రభుత్వం నిలబడటానికి ఆధారం అయిన రెండు నూతన భాగస్వామ్య పక్షాలను ప్రసన్నం చేసుకోవడం. ఇందులో భాగంగానే టిడిపి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, జెడియు నాయకత్వపు బీహార్‌కు ఎక్కువ కేటాయింపులు కల్పించారు. ఇందులో అగ్రవాటా చంద్రబాబునాయుడు సారధ్యపు ఎపికే దక్కింది.
ఇక ఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా కల్పించాలనే వాదన బలీయరీతిలో విన్పిస్తున్నందున నితీష్ కుమార్ సారధ్యపు జెడియు చేజారిపోకుండా చూసుకునేందుకు బీహార్‌కు కూడా పెద్ద పీట వేశారు. ఈ క్రమంలో పలు ఇతర రాష్ట్రాలు ప్రత్యేకించి కేటాయింపులు అత్యవసరం అయిన ప్రతిపక్షపాలిత రాష్ట్రాలపై నిర్మల బడ్జెట్‌లో శీతకన్ను వేశారనే విమర్శలు రగులుకున్నాయి. దేశంలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల తరువాత తగ్గిన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వపు తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ఇక వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుదైన రికార్డును కూడా సంతరించుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఈ ఏడాది కొన్ని రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం అయింది.
గ్రామీణ భారత అసంతృప్తిని చల్లార్చే పద్దులు
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధిక పెద్ద పీట వేసే యత్నం జరిగింది. లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ క్షీణతకు కారణం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న నిరుత్సాహం, అక్కడి నిరుద్యోగం, ఉపాధి లేమి అనేది స్పష్టం అయింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి గ్రామీణాభివృద్థికి బడ్జెట్‌లో రూ 2.66 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారు.
స్టార్టప్‌లపై భారం తగ్గించే చర్యలు
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మోడీ సర్కారు నినాదం స్టార్టప్ ఇండియా లేదా మేకిన్ ఇండియాను బలోపేతం చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా స్టార్టప్‌ల అన్ని స్థాయిల పెట్టుబడులపై యాంగెల్ టాక్స్‌ను రద్దు చేశారు. మొబైల్ ఫోన్లు, బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్(సిజిటి)ని సరళీకృతం చేశారు. ఫ్యుచర్స్, సెక్యూరిటీస్ ఆప్షన్స్‌పై సెక్యూరిటీలావాదేవీల పన్ను (ఎస్‌టిటి)ని పెంచారు. ఇది స్టాక్‌మార్కెట్ల బలోపేత చర్యగా తేల్చారు.
4.1 కోట్ల యువతకు పలు అవకాశాలు
తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఉద్యోగాల కల్పనకు రూ రెండు లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. దీనికి తోడుగా దేశంలోని 4.1 కోట్ల మందికి నైపుణ్య, ఇతరత్రా అవకాశాలను కల్పించేందుకు రంగంసిద్ధం చేసిందని వివరించారు.
బీహార్‌కు రూ 60,000 కోట్ల పెట్టుబడులు
ఈసారి బడ్జెట్‌లో బీహార్‌కు కేంద్రం అన్ని విధాలుగా మద్దతును ప్రకటించేవిధంగా ఆ రాష్ట్రానికి రూ 60,000 కోట్ల స్థాయిలో వ్యయ పద్దులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కేంద్రానికి అత్యంత కీలకమైన బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌వేలు, విద్యుత్ కర్మాగారాలు, వారసత్వ కట్టడాలు , కొత్త ఎయిర్‌పోర్టుల వంటి పలు మౌలిక సాధనాసంపత్తి ప్రక్రియలకు ఈ మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుంది. బీహార్‌కు ఆర్థిక ప్యాకెజ్, ప్రత్యేక హోదా కావలని జెడియు కోరుతోంది. పెట్టుబడుల కల్పనకు కేటాయింపులు సరిపోతాయని, సబ్సిడీలు, నగదు అవసరం లేదని కూడా బీహార్ పేర్కొంటోంది.
ఎపి అమరావతికి రూ 15,000 కోట్లు
కేంద్రంలోని ఎన్‌డిఎలో కీలక భాగస్వామ్యం అయిన టిడిపి ప్రసన్నానికి వీలుగా ఆ రాష్ట్రానికి రూ 15, 000 కోట్లను కేటాయించారు. ఇది పలు బహుళస్థాయి సంస్థల నుంచి ఆర్థిక సాయంగా ఉంటుంది. రాష్ట్రానికి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరం అయిన మేర మరింతగా సాయానికి కూడా వెనుకాడేది లేదని బడ్జెట్‌లో తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ 1.52 లక్షల కోట్లు
ఈ ఏడాది ఎప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ అమలులో ఉండే ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగం, అనుబంధ రంగాలకు రూ 1.52 లక్షల కోట్లు కేటాయించింది. పలు ప్రాంతాలలో రైతాంగం మోడీ ప్రభుత్వం పట్ల శ్రద్ధ వహించే దిశలో ఈ కేటాయింపులకు దిగింది.
3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ 1.52 లక్షల కోట్లు
పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో 3 కోట్ల నివాసయోగ్య గృహసముదాయాల నిర్మాణానికి రూ 1.52 లక్షల కోట్లు కేటాయించారు. దీని వల్ల ఇళ్లు లేని పేదలకు మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు.
చిన్న వ్యాపారాలకు రూ 20 లక్షల సాయం
దేశంలో ఉపాధి అవకాశాల పెంపుదలలో భాగంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రూ 20 లక్షల స్వల్ప రుణాలను అందిస్తారు. దేశంలో 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటు జరుగుతుంది. అంతరిక్ష రంగానికి సంబంధించి రూ 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ కల్పిస్తారని ఆర్థిక మంత్రి తెలిపారు. మధ్యతరగతి వర్గానికి స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచారు. ఏడాదిలో ఉద్యోగి పొందే మొత్తం వేతనాలను లెక్కచూసుకుని వారికి ఈ నికర తగ్గింపు ఉంటుంది. నూతన ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి టాక్స్‌స్లాబ్ పెంచారు.
విద్యార్థులకు సబ్సిడీ రుణాలు
విద్యార్థులు తమ నైపుణ్యాభివృద్ధిని పెంచుకునేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా దీనికోసం ఓ ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, సబ్సిడీ రుణాలు, కల్పించడం ద్వారా వారి ఉన్నత విద్యావకాశాలు ఇనుమడింపచేస్తారని ఆర్థిక మంత్రి తెలిపారు.
అంచనా కన్నా తగ్గిన ద్రవ్యోల్బణం.
ఈసారి 4.9 శాతం ఈసారి దేశ ద్రవ్యోల్బణం 4.9 శాతానికి కుదించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పటిష్ట పన్నుల వసూళ్లు, ఆర్‌బిఐ నుంచి ఊహించిన దాని కన్నా ఎక్కువ డివిడెండ్ చెల్లింపులతో ఆశాజనక పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ క్రమంలో జిడిపిలో ద్రవ్యోల్బణం స్థాయి ఇంంతకు ముందు ఫిబ్రవరిలో వెలువరించిన తాత్కాలిక బడ్జెట్‌లో అంచనా వేసిన 5.1 శాతం ద్రవ్యోల్బణం స్థాయిని ఇప్పుడు 4.9 శాతానికి తగ్గించగలిగామని బడ్జెట్‌లో మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి ప్యాకేజీ
నూతన ఉద్యోగులకు మూడు రకాల ప్రోత్సాహకాలు బడ్జెట్‌లో పొందుపరి చారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించగానే ఒక నెల వేతనం మూడు వా యిదాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ కింద గరిష్టంగా రూ.15వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది.జీతం లక్ష లోపు వారు దీనికి అర్హులు. తద్వారా 2.10కోట్ల మం ది యువతకు లబ్ధి చేకూరనున్నది. అదనంగా ఉద్యోగాలు కల్పించిన యా జమాన్యాలను ప్రొత్సహించేందుకు 2సంవత్సరాల పాటు రూ.3000 వర కు ఇపిఎఫ్‌ఓ కంట్రిబ్యూషన్ రియింబర్స్‌మెంట్. మహిళా ఉద్యోగులకు హా స్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలు. 20లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ.
వేతన జీవులకు రూ.17,500 ఆదా
బడ్జెట్‌లో వేతన జీవులకు కాస్త ఊరట కల్పిం చారు.పన్ను విధానంలో కాస్త మార్పు చేశా రు. స్టాం డర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ. 75వేలకు పెంచారు. దీన్ని 50% పెం చడం వల్ల రూ.17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చునని ఆర్థికమంత్రి తెలి పారు. ఎప్పటి లాగే కొత్త పన్ను విధానంలో రూ. 3లక్షల వరకు ట్యాక్స్ లేదు.