Sunday, February 2, 2025

మధ్య తరగతి మహా మేళా..

- Advertisement -
- Advertisement -

అంకెల్లో బడ్జెట్ (రూ.కోట్లలో)
రెవెన్యూ వసూళ్లు 34,20,409
మూలధన వసూళ్లు 16,44,936
మొత్తం వసూళ్లు 50,65,345
మూలధన వ్యయం 15,48,282
రెవెన్యూ లోటు ౦5,23,846
ద్రవ్యలోటు 15,68,936
ప్రాథమిక లోటు 2,92,598

బడ్జెట్ ప్రాధాన్యత అంశాలు..
ఆర్థిక, సమ్మిళిత అభివృద్ధి,
పెట్టుబడుల సాధనే బడ్జెట్ లక్షం
పది కీలక రంగాలపై ప్రత్యేక
దృష్టితో బడ్జెట్ రూపకల్పన
ఆర్థిక రంగానికి మూడో
ఇంజిన్‌గా పెట్టుబడులు
ఆరు విభాగాల్లో సంస్కరణలకు
శ్రీకారం..
పన్నులు, పట్టణాభివృద్ధి, ఆర్థిక,
గనులు, విద్యుత్, నియంత్రణ
సంస్థలలో సంస్కరణలు

బడ్జెట్‌లో వేతనజీవికి భారీ ఊరట ఆదాయం పన్ను మినహాయింపు రూ.7లక్షల
నుంచి ఒకేసారి రూ.12లక్షలకు పెంచిన నిర్మలా సీతారామన్ 6.3కోట్ల మంది పన్ను
చెల్లింపుదారులకు లబ్ధి కొన్ని ప్రాణరక్షక ఔషధాలపై పన్నుల్లో కోత మూలధన
వ్యయంలో స్వల్ప పెరుగుదల కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3లక్షల నుంచి
రూ.5లక్షలకు పెంపు రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన రాష్ట్రాల సహకారంతో
100 జిల్లాల్లో అమలు 1.7కోట్ల మంది రైతులకు లబ్ధి పట్టణ పేదలకు యుపిఐ లింక్డ్
క్రెడిట్ కార్డులు గిగ్‌వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు ఎస్‌సి, ఎస్‌టి
మహిళలకు టర్మ్ లోన్ పథకం విద్యారంగంలో కృత్రిమ మేధా సేవలు డిజిటల్
ఫామ్‌లో పాఠ్యపుస్తకాలు అదనంగా 75వేల మెడికల్ సీట్లు 50వేల స్కూళ్లలో అటల్
టింకరింగ్ ల్యాబ్స్ సెకండరీ స్కూళ్లలో బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ సేవలు త్వరలో మరో
5 ఐఐటిలు బీహార్‌లోని ఐఐటి పాట్నా విస్తరణ ఉడాన్ పథకం ద్వారా 125 రూట్లలో
విమానయాన సర్వీసులు పార్లమెంట్‌లో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

బడ్జెట్‌లో గణనీయంగా పన్నుల కోత
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యత్నం
ఆదాయపన్ను మినహాయింపు
రూ.12 లక్షలకు పెంపు బీమా రంగంలో
విదేశీ పెట్టుబడులు 100 శాతానికి పెంపు
ప్రాణరక్షక ఔషధాలపై పన్ను తగ్గింపు
పంటల సాగు ప్రోత్సాహానికి జాతీయ
మిషన్ ఏర్పాటు గిగ్ వర్కర్లకు ఆరోగ్య
బీమా, గుర్తింపు కార్డులు స్టార్టప్‌ల కోసం
రూ.10వేల కోట్ల నిధి ఏర్పాటు కోబాల్ట్,
లిథియం బ్యాటరీలపై దిగుమతి
సుంకం తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్య తరగతి ప్రజల కోసం గణనీయంగా ఆదాయపు పన్ను కోతలు ప్రకటించారు. తదుపరి తరం సంస్కరణలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆమె ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల మధ్య మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. ఏడాదికి రూ. 12.75 లక్షల వరకు ఆర్జిస్తున్న వ్యక్తులు ఎటువంటి పన్నులూ చెల్లించనవసరం లేదు. పన్నుల మినహాయింపు కోసం ఆదాయం పరిధిని రూ. 7 లక్షల నుంచి ఆమె పెంచారు. ఆ పరిధికి మించి ఆర్జిస్తున్న వ్యక్తుల కోసం పన్నుల శ్లాబ్‌లను కూడా ఆమె సవరించారు. సాలుకు రూ. 25 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్నుల్లో రూ 1.1లక్షల వరకు ఆదా చేయగలిగేలా ఆ పరిధిని పెంచారు. పన్ను కోతల వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ. 1 లక్ష కోట్ల వరకు భారం పడుతుంది. అయితే, ఆ కోతల వల్ల 6.3 కోట్ల మందికి లేదా ఏడాదికి రూ. 12 లక్షలు వరకు ఆర్జిస్తున్న 80 శాతం మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు లబ్ధి కలుగుతుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ‘సంస్కరణల’ బడ్జెట్‌గా పేర్కొంటున్న బడ్జెట్‌ను లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతూ, ‘కొత్త పన్నుల వ్యవస్థ వల్ల మధ్య తరగతిపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా వారి వద్ద మరింత డబ్బు ఉండేలా చూస్తుంది, గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది’ అని తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ బీమా రంగంలో విదేశీ పెట్టుబడి (ఎఫ్‌ఐ) పరిమితిని ప్రస్తుతపు 74 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని, మౌలిక వసతులపై వ్యయ పరంపరను కొనసాగించాలని ప్రతిపాదించారు. సామాజిక రంగాలకు కేటాయింపులు పెంచగా, నిరుపేదలు, యువజనులు, రైతులు, మహిళల కోసం పథకాలకు అవకాశం కల్పించారు. ఆర్థిక ఏకీకరణ రోడ్‌మ్యాప్‌నకు ఆమె కట్టుబడి ఉంటూనే ఎఫ్‌వై26లో జిడిపిలో 4.4 శాతం ద్రవ్య లోటు ఉంటుందని సూచించారు. మార్చి 31తో ముగిసే ప్రస్తుత సంవత్సరంలో అంచనా వేసిన ద్రవ్య లోటు 4.8 శాతం. ఇంటర్‌మీడియరీస్, కొన్ని రకాల ప్రాణ రక్షక ఔషధాలపై కూడా పన్ను కోతలను మంత్రి ప్రకటించారు. రెవెన్యూ నష్టం సమతౌల్యం కోసం

ఆమె వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 11.21 లక్షల కోట్ల మేరకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదలను ప్రకటించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నది. అంతే కాకుండా, రిజర్వ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ యాజమాన్య ఆర్థిక సంస్థల నుంచి ఆశిస్తున్న డివిడెండ్‌లో పెరుగుదల ఆ నష్టాలను తగ్గించేందుకు వీలు కల్పిస్తుంది. కరోనా మహమ్మారి దరిమిలా, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ముప్పులు, ముఖ్యంగా భారత్‌పై కూడా విస్తృత టారిఫ్‌లు విధిస్తామని యుఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెడరించిన దృష్టా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించిన నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రతిపాదన జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 6.4 శాతం జిడిపి వృద్ధి, వచ్చే సంవత్సరానికి అంచనా వేసిన 6.3 శాతం నుంచి 6.8 శాతం వృద్ధి రేటు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే ఆశావహ లక్ష సాధనకు కావలసిన 8 శాతం వృద్ధి రేటు కన్నా బాగా తక్కువగా ఉంది. ‘కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో ఒక శాతంగా క్షీణించే మార్గంలో కొనసాగే విధంగా ప్రతి సంవత్సరం ద్రవ్య లోటును కొనసాగించడం మా య త్నం’ అని నిర్మల 2031 మార్చి నాటికి జిడిపిలో 50 శాతం గా రుణభారాన్ని సూచిస్తూ చెప్పారు.

మంత్రి ప్రకటించిన ఇతర చర్యల్లో పప్పు ధాన్యాలు, పత్తి ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టితో అధిక దిగుబడి పంటల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్, రైతులకు సబ్సిడీ పరపతి పరిమితి రూ. 3 లక్షల నుం చి రూ.5లక్షలకు హెచ్చింపు, తయారీ, ఎగుమతుల ప్రోత్సాహానికి మిషన్లు, తోలు, పాదరక్షలు వంటి శ్రామిక శక్తి రంగా ల కోసం కొత్త విధానం, భారత్‌ను ప్రపంచంలో బొమ్మల తయారీ కేంద్రంగా చేసేందుకు ఒక పథకం కూడా ఉన్నాయి. సుమారు ఒక కోటి మంది గిగ్ వర్కరల కోసం సామాజిక భద్రత పథకాన్ని, స్టార్టప్‌ల కోసం రూ. 10 వేల కోట్ల నిధిని కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 2047 నాటికి అణు శక్తి నుంచి కనీసం 100 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్షాన్ని, ప్రైవేట్ రంగం పెట్టుబడిని అనుమతించేందుకు మరొక ముఖ్య ప్రకటన చేశారు. ఓపెన్ సెల్స్ సహా పలు సరకులపై సుంకాల తగ్గింపును కూడా సీతారామన్ ప్రకటించారు. కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ సాధనాలు, లెడ్, జింక్ వంటి కీలక ఖనిజాలను, కొన్ని ఇతర వస్తువులను దిగుమతి సుంకం నుంచి మంత్రి పూర్తిగా మినహాయించారు.

వచ్చే ఏడాదికి రూ. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదన.. ప్రస్తుతాని కన్నా 7.4% అధికం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ. 5065345 కోట్ల వ్యయాన్ని సూచిస్తూ 202526 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని స్థాయి కన్నా 7.4 శాతం అధికం. బడ్జెట్ పత్రాల ప్రకారం, వచ్చే ఏప్రిల్ 1న మొదలు కానున్న ఆర్థిక సంవత్సరానికి కేం ద్ర ప్రాయోజిత పథకాల కోసం రూ.541850.21 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇందు కోసం కేటాయించిన మొత్తం రూ.415356.25 కోట్లు. కేంద్ర రంగ పథకాల కోసం 202425లోని రూ.15.13 లక్షల కోట్లతో పోలి స్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 16.29 లక్షల కోట్లు కేటాయించడమైంది. మార్కెట్ రుణాలు, ట్రెజరీ బ బిల్లులు, బాహ్య రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్ నిధులపై వడ్డీ చెల్లింపు, మూల ధన వ్యయం సహా సాయుధ బలగాల

అధిక అవసరాలు, ఉపాధి కల్పన పథకం కోసం మరిన్ని కేటాయింపులతో సహా పలు కారణాలపై 202526కు సంబంధించి వ్యయం బడ్జెట్ అంచనాలు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత మొత్తం మూలధన వ్యయం రూ.11.22 లక్ష ల కోట్లు కాగా, ప్రభావిత మూలధన వ్యయం రూ. 15.48 లక్షల కోట్లు. 202526 బడ్జెట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాల వాటా పంపిణీ, గ్రాంట్లు/ రుణాలు, నిధుల విడుదలలు సహా రాష్ట్రాలకు బదలాయిస్తున్న మొత్తం వనరులు రూ. 2501284 కోట్లు. 202324లో బదలాయించినవాటి కన్నా ఇవి రూ. 491668 కోట్లు అధికం. ప్రభుత్వ రంగ సంస్థల వనరులను కూడా కలిపినట్లయితే బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ. 54.97 లక్షల కోట్లకు పెరుగుతుంది.

ఆశలు నెరవేర్చే బడ్జెట్
భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలు రాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాం క్షలు నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదా య వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం.

ఎన్‌డిఎ 3.0 ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్‌లో మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. అనూహ్యంగా ఆదాయం పన్ను పరిమితి రూ.12లక్షలకు పెంచి వేతనజీవులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వరుసగా ఎనిమిదోవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ సబ్బండ వర్గాల సంక్షేమానికి నిధులు కురిపించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కీలక రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బడ్జెట్ సమర్పణ సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపును సాధించామని, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి మందగించినా దేశం మెరుగైన పనితీరు కనబరిచిందని అభివర్ణించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశారు.

బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త మిషన్లు
బీహార్‌లో మకాన్ బోర్డు రాష్ట్రాల సహకారంతో పిఎం ధన్‌ధాన్య్
పథకం అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్
గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నివారణకు ప్రత్యేక కార్యక్రమం
పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయి పత్తి మిషన్
పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి ఆరేళ్ల వ్యవధితో మిషన్
లక్ష కోట్లతో పట్టణాల అభివృద్ధికి అర్బన్ ఛాంలెజ్ ఫండ్
చిన్న స్థాయి అణు కేంద్రాల కోసం జాతీయ అణు శక్తి మిషన్ జ్ఞాన
భారతి మిషన్ భవిష్యత్ ఆహార భద్రత కోసం రెండు జన్యు బ్యాంకులు
25 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది తల్లుల కోసం ప్రత్యేక
అంగన్‌వాడీ 3.0 పరిశ్రమల ప్రోత్సాహకం కోసం ప్రత్యేక మిషన్
రూ. 25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News