Friday, November 22, 2024

జులై 22న కేంద్ర బడ్జెట్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారయిందని తెలుస్తోంది. ఇవి జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి రోజే కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుందని సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు కథనం.

కొత్తగా ఏర్పడిన 18వ లోక్ సభ సమావేశాలు జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. తొలి విడత సమావేశంలో సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నికకు పట్టే సమయాన్ని మినహాయిస్తే పనిదినాలు కేవలం 5 రోజులే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం వర్షకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News