న్యూఢిలీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలుత లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం రాజ్యసభలో సమర్పిస్తారు. కాగా నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం వరసగా ఇది అయిదో సారి. కాగా గత రెండు సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌గానే ఉంటుంది. మరోవైపు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడం గమనార్హం.
ఎన్నికల సంవత్సరానికి ముందు రానున్న బడ్జెట్ కావడంతో నిర్మలమ్మ బడ్జెట్‌పై అన్నివర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం భయాలు, కొవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి ఓట్లు పండించే తాయిలాలతో జనాకర్షక బడ్జెట్‌కు పెద్ద పీట వేస్తారా లేక ఆర్థిక సుస్థిరతకే కట్టుబడి ఉంటారో వేచి చూడాల్సి ఉంది.