Monday, January 20, 2025

పిఎం శ్రీ స్కూళ్లకు రూ.27,360 కోట్ల వ్యయ పథకం

- Advertisement -
- Advertisement -

పిఎం శ్రీ స్కూళ్లకు రూ 27,360 కోట్ల వ్యయ పథకం
కేంద్ర కేబినెట్ ఆమోదం ..ప్రామాణిక విద్యకు పట్టం
కేంద్రీయ, నవోదయ విద్యాలయాలకే మెరుగులు
ఐదేళ్ల ఖర్చులో కేంద్రం వాటా రూ 18,128 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో తలపెట్టిన 14000కు పైగా పిఎం శ్రీ స్కూళ్లు పరిణతికి రూ.27,360 కోట్ల పథకం తీసుకువచ్చారు. ఈ పిఎం శ్రీ అభివృద్థి పథకం ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితమే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ పిఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటు గురించి ప్రకటించారు. వృద్ధి చెందుతున్న భారతదేశపు ఆకాంక్షలకు అనుగుణంగా స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఈ స్కూళ్ల ఏర్పాటు చేపట్టారు. ఇప్పుడున్న కొన్ని విద్యాసంస్థలను ఎంచుకుని వాటిని అప్‌గ్రేడ్ చేయడం, ఆధునీకరించడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఆధ్వర్యంలోని స్కూళ్లను కొన్నింటిని ఈ పిఎం శ్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతారని ప్రధాని చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ కార్యక్రమానికి సంబంధించి పథకం ఆమోదం పొందిందని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ కేబినెట్ భేటీ తరువాత విలేకరులకు తెలిపారు. ఈ స్కీం పరిధిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఇతర స్కూళ్లను చేరుస్తారు. ఈ స్కీం మొత్తం రూ 27,360 కోట్లు. ఐదేళ్ల ఈ వ్యయమొత్తంలో కేంద్రం తరఫున రూ 18,128కోట్లు వెచ్చిస్తారని కేంద్ర మంత్రులు తెలిపారు. మిగిలిది రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఈ స్కీం అమలు ద్వారా దేశవ్యాప్తంగా 18.7లక్షల మంది విద్యార్థులకు సరైన ప్రామాణిక విద్య పొందేందుకు వీలేర్పడుతుంది. పిఎం శ్రీ స్కూళ్లతో విద్యార్థులకు ప్రస్తుత ప్రపంచంలో పోటీ విద్యారంగాన్ని తట్టుకునే విధంగా ఉన్నత నాణ్యతాయుత విద్యను అందించడం జరుగుతుందని విద్యా, నైపుణాభివృద్ధి మంత్రిత్వశాఖను నిర్వహిస్తోన్న ప్రధాన్ విలేకరులకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కూడా సరైన మార్గదర్శకత్వంతో ఈ స్కూళ్లను తీర్చిదిద్దడం ద్వారా ఇతర విద్యాసంస్థలకు నాయకత్వం వహించేలా చేస్తారని మంత్రి వెల్లడించారు.
కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు ఆమోదం
రూ 1957 కోట్ల వ్యయ అంచనాలు, 11 కిలోమీటర్లు విస్తరించుకుని ఉండే విధంగా తలపెట్టిన కొచ్చి మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులోకి 11 స్టేషన్లు వస్తాయి. రెండో దశ ప్రాజెక్టుకు ఏర్పాట్ల పనులు చేపడుతారు. ఇందులో భాగంగా సీపోర్టు ఎయిర్‌పోర్టు రోడ్ విస్తరణ కార్యక్రమం వేగవంతం చేశారు. కొచ్చి మెట్రో తొలి దశలో భాగంగా అలువా నుంచి పెట్టా వరకూ రైలు అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇప్పుడు విస్తరిస్తారు.

Union Cabinet Approves 14000 PM SHRI Schools

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News