Friday, January 10, 2025

5జి వేలానికి వేళాయే..

- Advertisement -
- Advertisement -

Union Cabinet approves 5G spectrum auction

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
జులై నెలాఖరుకల్లా వేలం

మొత్తం 72,097.85 మెగాహెడ్జ్‌ల రేడియో వేవ్‌లను 20 ఏళ్ల కాలానికి వేలం

న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది.5 జి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గవ ఆమోదముద్ర వేసింది. జులై చివరి నాటికి 72,097.85 మెగాహెడ్జ్‌లస్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది.‘ 5 జి సేవలను అందించే స్పెక్ట్రమ్‌ను వేలం వేయడానికి టెలీ కమ్యూనిరేషన్స్ విభాగం చేసిన ప్రతిపాదనకు జూన్ 14న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతనసమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 72,097.85 మెగాహెడ్జ్‌ల రేడియో వేవ్‌లను 20 ఏళ్ల కాల వ్యవధితో వేలం వేయనున్నారు. ఇందులో తక్కువ (600ఎంజడ్‌హెచ్,700 ఎంజడ్‌హెచ్, 800 ఎంజడ్‌హెచ్,900 ఎంజడ్‌హెచ్, 1800ఎంజడ్‌హెచ్,2100ఎంజడ్‌హెచ్,2300ఎంజడ్‌హెచ్),మధ్యస్థాయి(3300ఎంజడ్‌హెచ్),అత్యధిక(26జిహెచ్‌జడ్)ఫ్రీక్వెన్సీ బాండ్లకుస్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం రంగంలో సంస్కరణలతో ఈ వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు స్పెక్ట్రమ్ వేలంలో కేబినెట్ పలు ఆప్షన్లు తీసుకువచ్చింది. టెలికాం వేలంలో తొలిసారిగా ముందస్తు చెల్లింపు ల నిబంధనను ఎత్తివేసింది.అంటే… వేలంలో విజేతగా నిలిచిన బిడ్డర్లు ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు. మొత్తం ధరను 20 సమాన వాయిదాల్లో చెల్లించాలి.

అయితే ప్రతి వాయిదాను సంవత్సర ప్రారంభంలోనే చెల్లించాలి’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక బిడ్డర్లు 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రమ్‌ను తిరిగి ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అప్పుడు బ్యాలెన్స్ వాయిదాలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే వేలం ధర ఎంత అన్నది మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు. 5జి స్పెక్ట్రమ్‌పై ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని టెలికాం సంస్థలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అందుబాటు ధరల్లోనే స్పెక్ట్రమ్‌ను తీసుకువచ్చేందుకు టెలికాం విభాగం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.5 జి సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జిలో వస్తున్న డౌన్‌లోడ్ స్పీడ్‌కంటే 20 రెట్లు వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందే వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News