- Advertisement -
ఢిల్లీ: వార్షిక బడ్జెట్ 2025-26కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి ఆర్థిక మంత్రి అందించారు.
శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై ప్రసంగించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.53 లక్షల కోట్ల మేరకు కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2023-25) కేంద్ర బడ్జెట్ 48 లక్షల 20 వేల కోట్ల రూపాయలుగా ఉంది.
- Advertisement -