Sunday, December 29, 2024

డబ్లింగ్ పనులకు గ్రీన్‌ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. ఇం దుకోసం కేంద్రం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో హైదరాబాద్‌చెన్నై మ ధ్య 76 కి.మీ. దూరం తగ్గనుంది. అదేవి ధంగా రూ. 5655.4 కోట్ల అంచనా వ్య యంతో ముద్కేడ్‌మేడ్చల్, మహబూబ్‌నగర్‌డోన్ మధ్య రైల్వేలైన్ (502. 34 కి.మీ.) డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్‌బెంగళూరు మధ్య 50 కి.మీ దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో నె ర్గుండి బారాంగ్, ఖుర్దారోడ్ విజయనగరం మధ్య (417.6 కిమీ) 5618 26 కోట్ల అంచనా వ్యయంతో మూడో రై ల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ పట్నంచెన్నై మధ్య మూడోరైల్వే లైన్ డిపిఆర్ సిద్ధం కాగా, 3వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.
ఏడు బహుళ ట్రాక్‌ప్రాజెక్టులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఏడు బహుళ ట్రా క్ (మల్టీ ట్రాకింగ్)ప్రాజెక్టులకు కేబినెట్ ఆ ర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే తరువాయి మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ. 32,500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల రైలు ఆపరేషన్లలో రద్దీ తగ్గి, ప్రయాణ, రవాణా సౌకర్యాల్లో మరింత వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. దేశం లోని తొమ్మిది రాష్ట్రాల్లో 35 జిల్లాలకు ఈ పథకం విస్తరిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ పథకం అమలు కానుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్ 2339 కిమీ వరకు విస్తరిస్తుంది.
విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే
రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే “పిఎం విశ్వకర్మ ” పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఈ పథకం గురించి మోడీ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిందని తెలిపారు. ఈ పథకం కోసం ఐదేళ్లపాటు రూ. 13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో 18 సంప్రదాయ వృత్తులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

వారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్లను జారీ చేసి గుర్తిస్తామని, ఆ తరువాత తొలిదశలో వారికి రూ.1 లక్షవరకు , రెండోదశలో రూ.2 లక్షల వరకు రుణసదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ రుణంపై రాయితీ వడ్డీ రేటు 5 శాతం అని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి , వృత్తి సంబంధిత పరికరాల కొనుగోలుకు ప్రోత్సాహం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు అందజేయనున్నట్టు చెప్పారు. వడ్రంగి పనివారు, పడవల తయారీదారులు, బ్లాక్‌స్మిత్, లాక్‌స్మిత్, గోల్డ్‌స్మిత్, కుండల తయారీదారులు, శిల్పులు, చర్మకారులు , తాపీ మేస్త్రీలు, తదితరులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని చెప్పారు. ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షతరువాత పరికరాల కొనుగోలుకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

పీఎం ఈబస్‌సేవ
ఈ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పీఎం ఈబస్ సేవకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనీషియేటివ్ కింద 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. దేశం లోని 169 నగరాల్లో 10,000 ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యం విధానంలో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకానికి రూ. 57,613 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. ఈ వ్యయంలో రూ. 20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని తెలిపారు. పదేళ్లపాటు బస్సు సేవలకు ఈ పథకం అండదండలు అందిస్తుందన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 45 వేల నుంచి 55 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ ప్రకటన వివరించింది.

రూ. 14,903 కోట్లతో డిజిటల్ ఇండియా ప్రాజెక్టు విస్తరణ
రూ. 14,903 కోట్లతో డిజిటల్ ఇండియా ప్రాజెక్టును విస్తరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం ఉన్న దాదాపు 5.25 లక్షల మంది ఐటి ఉద్యోగుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించేలా శిక్షణ కల్పించడానికి వీలవుతుంది. వీరితోపాటు ఈ రంగం లోని మరో 2.65 లక్షల మందికి సమగ్రమైన శిక్షణ కల్పిస్తారు. ఈ పథకంలో చెప్పుకోతగిన మరో అంశం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌సిఎం) కింద అదనంగా తొమ్మిది సూపర్ కంప్యూటర్‌లను చేర్చుకుంటారు. దీంతో ఎన్‌సిఎం కింద ఉన్న సూపర్ కంప్యూటర్ల సంఖ్య 27కు పెరుగుతుంది.

దీనివల్ల కంప్యూటరింగ్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుంది. సైంటిఫిక్, టెక్నలాజికల్ ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి. సాంకేతిక మౌలిక సౌకర్యాలు , నైపుణ్యాలు ఇంకా అభివృద్ధి చెందడానికి దోహదం కలుగుతుంది. ఇప్పటికే ఈ పథకం కింద 18 సూపర్ కంప్యూటర్లను చేర్చడమైందని మంత్రి తెలిపారు. పరి శోధన, సాంకేతిక ఆవిష్కరణ, డేటాతో కూడిన అంశాలు వివిధ పరిశ్రమలు, సంస్థల్లో విస్తరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News