Sunday, December 22, 2024

మహిళా స్వయం సహాయ సంఘాలకు డ్రోన్లు: కేంద్ర మంత్రివర్గం ఆమోదం

- Advertisement -
- Advertisement -

గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. బుధవారం నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా స్వయం సహాయ సంఘాలకు డ్రోన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 15వేల డ్రోన్లను మహిళా సంఘాలకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

వ్యవసాయ పనుల్లో వాడేందుకు వీలుగా కేంద్ర ఈ డ్రోన్లు ఇవ్వనుంది. మహిళా సంఘాలు డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించింది.ఇక, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ ను మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ నెలకు 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ పంపిణీ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News