వన్ నేషన్… వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం త్వరలో పార్లమెంట్‌లో
బిల్లు.. జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన కోవిందు కమిటీ 2023లో మాజీ రాష్ట్రపతి
రామ్‌నాథ్ కోవిందు అధ్యక్షతన జమిలి ఎన్నికల కమిటీ ఏర్పాటు మార్చి 14న
రాష్ట్రపతికి నివేదిక 18629పేజీల నివేదిక సమర్పించిన కమిటీ తొలి దశలో
పార్లమెంట్, అసెంబ్లీ కి ఎన్నికలు రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు జమిలి
ఎన్నికల కోసం రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సిన అవసరం ఉంది జమిలి
ఎన్నికల కోసం దేశ వ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా తయారీ బిజెపి సహా 32పార్టీలు
సానుకూలం వ్యతరేకించిన కాంగ్రెస్, మరో15 రాజకీయ పార్టీలు పార్లమెంట్
సమావేశాలకు రావాలని ఎంపిలకు కాంగ్రెస్ , బిజెపి విప్ జారీ రేపు ఎల్లుండి
రాజ్యాంగంపై చర్చలు జరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా రావాలని ఆదేశం
జమిలి ఎన్నికలకు సంబంధించి మరో ముందడుగు పడింది. వీటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13,14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ, దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసి)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు , అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు. అనంతరం కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరు లోనే పచ్చజెండా ఊపింది. తాజా పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం, తాజాగా కేంద్ర కేబినెట్‌లో ఆమోద ముద్ర వేసింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనలను 30 కి పైగా పార్టీలు సమర్ధించగా, కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంటోంది. తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని , ప్రజాస్వామ్య మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవరసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని వాదిస్తోంది.