Monday, December 23, 2024

పిఎం ఈ-బస్ సేవకు కేంద్ర కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పీఎం ఈ-బస్ సేవకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో  వెల్లడించారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనీషియేటివ్ కింద 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. దేశం లోని 169 నగరాల్లో 10,000 ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యం విధానంలో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ పథకానికి రూ. 57,613 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. ఈ వ్యయంలో రూ. 20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని తెలిపారు. పదేళ్లపాటు బస్సు సేవలకు ఈ పథకం అండదండలు అందిస్తుందన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 45 వేల నుంచి 55 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ ప్రకటన వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News