- Advertisement -
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అసెంబ్లీని సస్పెండ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ సిఫార్సు చేశారని జావడేకర్ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రివర్గ నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపుతామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి అంగీకారం తరువాత అసెంబ్లీ రద్దవుతుంది. పుదుచ్చేరిలో పరిపాలనాకు అవసరమైన అవసరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని జవదేకర్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
Union Cabinet approves President’s rule in Puducherry
- Advertisement -