Sunday, January 12, 2025

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’(One Nation, One Election) ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై  రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జమిలి ఎన్నికల బిల్లుకు కూడా ఆమోద ముద్ర వేసింది. జమిలీ ఎన్నికలపై రామ్ నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదికను మార్చి 14న అందజేసింది.

జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా తయారీకి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపగా, 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 2027లో దేశవ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికలు కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

జమిలి ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రామ్ నాథ్ కోవింద్ కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.  ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 356, 324, 83(2), 172(1), 83లలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News