Saturday, November 23, 2024

ప్రధాని అధ్యక్షతన రేపు క్యాబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -
union cabinet meeting tomorrow chaired by pm modi
మంత్రుల పనితీరుపై సమీక్ష?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం కానున్నది. దేశంలో కొవిడ్ పరిస్థితి గురించి చర్చించడంతోపాటు కొన్ని మంత్రిత్వశాఖల పనితీరును కూడా ఈ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరుగుతుందని వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రోడ్డు, రవాణా, పౌరవిమానయానం, టెలికం మంత్రిత్వశాఖల పనితీరును సమీక్షించనున్నట్లు వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 పరిస్థితిపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు.

సంబంధిత మంత్రిత్వశాఖల పనితీరును సమీక్షించడానికి ప్రధాని మోడీ వారం క్రితం క్యాబినెట్, సహాయ మంత్రులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ సమావేశాలు ప్రధాని అధికారిక నివాసంలో జరిగాయని, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఈ చర్చలలో పాల్గొన్నారని వర్గాలు చెప్పాయి. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు జరగనున్నట్లు రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు సాగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News