Sunday, January 19, 2025

ప్రధాని మోడీకి కేబినెట్ జి 20 కంగ్రాట్స్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం తీర్మానం వెలువరించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. పలు నిర్ణయాలు తీసుకుంది.వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. ఇటీవలి జి 20 సదస్సు భారీ స్థాయిలో విజయం సాధించిందని, ఇందుకు దేశం తరఫున ప్రధానికి అభినందనలు తెలియచేస్తూ ఈ తీర్మానం వెలువరించినట్లు మంత్రి వివరించారు. ప్రధాని మోడీ ప్రపంచ కూటమిల వ్యక్తిగా పరిణతి చెందారని తెలిపారు.

ప్రధాని మోడీ తీసుకున్న చొరవతో ఇప్పుడు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియెన్సెస్ ఏర్పాటు అయింది. ఏకాభిప్రాయ సాధనతో ఆఫ్రికా యూనియన్‌ను జి 20లోకి తీసుకోవడం జరిగిందని, ఇవన్నీ ప్రధాని మోడీ నాయకత్వపు జి 20 సదస్సు విజయాలని తెలిపారు. ఏకాభిప్రాయ సాధనతో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు జి 20 తీర్మానం వెలువడటం కీలక విషయం అని పేర్కొంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించిన అభినందన తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార మంత్రి వివరించారు. దేశం మొత్తం తరఫున ప్రధానిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
అదనంగా 75 లక్షల ఉజ్వల వంటగ్యాసు కనెక్షన్లు
దేశంలో గృహిణులకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) పరిధిలో అదనంగా 75 లక్షల ఉచిత వంటగ్యాసు కనెక్షన్లు కల్పిస్తారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో 2026 మార్చి నాటికి ఈ అదనపు గ్యాసు కనెక్షన్లు కల్పిస్తారని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సంబంధిత గ్యాసు కనెక్షన్ల కోసం రూ 1,650 కోట్లు కేటాయించారు. ఇక సూవెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో సైప్రస్ దేశానికి చెందిన సంస్థ రూ 9589 కోట్ల విదేశీ పెట్టుబడి (ఎఫ్‌డిఐ) సంబంధిత నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News