- Advertisement -
గువహతి : దేశంలో ఉమ్మడి శిక్షా స్మృతి (యుసిసి) అమలు జరిపితీరాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో దీనిని వెంటనే అమలు చేయాల్సి ఉందన్నారు. ఉత్తరాఖండ్‌లో తమ బిజెపి ప్రభుత్వం యుసిసి ముసాయిదాను సిద్ధం చేస్తుందని చెప్పిన అక్కడి సిఎం పుష్కర్ సింగ్ ధామితో శర్మ ఆదివారం సమావేశం అయ్యారు. తనను కలిసిన పలువురు ముస్లింలు దేశంలో ఉమ్మడిశిక్షా స్మృతిని కోరతున్నట్లు చెప్పారని శర్మ వెల్లడించారు. భర్త రెండు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలని ఏ ముస్లిం మహిళ కోరుకోదని అన్నారు, ఉమ్మడి శిక్షా స్మృతి అమలులోకి వస్తే ముస్లిం మహిళకు సమున్నత గౌరవం దక్కుతుందని చెప్పారు.
- Advertisement -