Wednesday, January 22, 2025

అడగకున్నా గుజరాత్‌కు అప్పుల వరద

- Advertisement -
- Advertisement -

నిబంధనల పేరిట తెలంగాణకేమో మోకాలడ్డు
సెక్యూరిటీ బాండ్ల తాజా వేలంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
కోరిందేమో రూ.1000 కోట్లు, ఇచ్చింది రూ.1500 కోట్లు
మిగతా 8 రాష్ట్రాలకు కుంటిసాకులతో కోతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభు త్వం గడచిన ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందనే విమర్శ లు తారాస్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల కేం ద్రం పక్షపాతధోరణితో వ్యవహరిస్తుందా..? లేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందా..? అ నే అనుమానాలు కలుగుతున్నాయని కొందరు పా ర్లమెంటు సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాగానీ గుజరాత్ రాష్ట్రంపై అంతులేని ప్రేమను వలకబోస్తూ మిగతా బిజేపీయేత రాష్ట్రాలను చిన్నచూ పు చూస్తున్నారని అనేక సందర్భాలు రుజువుచేశాయని తెలిపారు. తాజాగా మంగళవారం రిజ ర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో గుజరాత్ రాష్ట్రం వెయ్యి కోట్ల రూపాయలు కావాలని కోరగా అందుకు 500 కోట్ల రూపాయలను అదనపు డబ్బును కలుపుకొని మొత్తం 1500 కోట్ల రూ పాయల నిధులను సేకరించి పెట్టిందని, మిగ తా ఎనిమిది రాష్ట్రాలు అడిగిన నిధుల్లో కోతలు విధి స్తూ, అనేక కుంటిసాకులు చెబుతూ వేలంకు అనుమతులిచ్చిన ఆర్.బి.ఐ. ఒక్క గుజరాత్ రాష్ట్రంపై ఎంతకంత అమితమైన ప్రేమను చూపిస్తుందో అర్ధంచేసుకోవాలని కొందరు ఎంపీలు, టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు మండిపడ్డారు.

మంగళవారం ఆర్.బి. ఐ.నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో తొ మ్మిది రాష్ట్రాలు పాల్గొన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మణిపూర్ (250 కోట్లు), మిజో రాం(90 కోట్లు), పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ (3000 కోట్లు) రాష్ట్రాలు వేలం లో పాల్గొన్నాయి. ఎనిమిది రాష్ట్రాలకు అడిగిన మేరకే నిధులను మంజూరు చేసిన ఆర్.బి.ఐ.గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే అదనపు నిధులుగా 500 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకునే విధంగా వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇవ్వడం, ఆ నిధులు మంజూరు కావడం జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2000 కోట్లు, అస్సాంకు రూ.1000 కోట్లు, పంజాబ్‌కు రూ.2000 కోట్లు, రాజస్థాన్‌కు రూ.2000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3000 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం 9 రాష్ట్రాలకు కలిపి 12,340 కోట్లకు గానూ గుజరాత్‌కు అదనంగా 500 కోట్ల రూపాయలు ఇవ్వడంతో 12,840 కోట్ల రూపాయల నిధులను ఆయా రాష్ట్రాలకు ఆర్.బి.ఐ. విడుదల చేసింది.

ఇలా రిజర్వు బ్యాంకు పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు, మంచి మార్కులు కొట్టేసేందుకు ఆర్.బి.ఐ.పెద్దలు అడిగినా… అడగక పోయినా గుజరాత్ రాష్ట్రానికి ప్రతి వేలంలోనూ అదనపు నిధుల రూపంలో వందలు, వేలాది కోట్ల రూపాయల నిధులను ఆర్.బి.ఐ. విడుదల చేస్తూ స్వామి భక్తిని చాటుకుంటోందని కొందరు టి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు సైతం ఘాటుగా విమర్శనాస్త్రాలను సంధించారు. అంతేగాక సాక్షాత్తూ పార్లమెంట్ ప్రాంగణంలో సైతం టి.ఆర్.ఎస్.ఎంపీలు నిధుల సమీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుసరిస్తున్న పక్షపాత ధోరణులను సైతం ఎండగట్టారు.

ఇలా కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించడంలో జాప్యం జరుగుతోందని, అలా కాకుండా 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఏయే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎన్నెన్ని నిధులను కేటాయించామో, ఆ పథకాలకు అవసరమైన నిధులను ఎలా సమీకరించుకొంటాము అనే ప్రతిపాదనలను కూడా పొందుపరిచామని, ఆ బడ్జెట్‌ను ఆమూలాగ్రం చదువుకొన్న కేంద్రం ముందుగా ఆమోదించి.. ఆ తర్వాత అనేక కొత్త రూల్సు తెచ్చి, కుంటిసాకులు చెబుతూ నిధుల సమీకరణకు అడ్డుపుల్లలు వేసిందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. అందుకే ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మేనెలలకు రావాల్సిన 8000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజలు కోల్పోవాల్సి వచ్చిందని, ఇంతటి నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నాలు కూడా చేయకుండా ఇంకనూ కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు సృష్టిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గుజరాత్ రాష్ట్రానికేమో అడిగిన వాటి కంటే అదనంగా నిధులు ఇచ్చేందుకు ఆర్.బి.ఐ. రూల్సు అనుమతిస్తాయంటగానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రూల్సు మారాయని, కొత్త రూల్సు ప్రకారం ఎక్కువ తక్కువ అప్పులు చేయవద్దని హితోక్తులు పలుకుతున్నారని మండిపడ్డారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం 53,970 కోట్ల రూపాయలను రుణాలను సేకరించుకోవాల్సి ఉండగా రకరకాల కుంటిసాకులు చెప్పి దాన్ని 23 వేల కోట్ల రూపాయలకు తగ్గించిన కేంద్రం ఆర్ధికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నం చేసిందని స్పష్టమయ్యిందని, అందుకే తాము కూడా కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎండగడుతున్నామని టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు వివరించారు. ఎఫ్.ఆర్.బి.ఎం (ఆర్ధిక నిర్వహణ, బడ్జెట్ యాజమాన్యం) చట్టం ప్రకారం నిబంధనలను లోబడే తెలంగాణ రాష్ట్రం రుణాలను తీసుకుంటోందని ఓ వైపు అంగీకరిస్తున్న ఆర్.బి.ఐ. ఇతర రాష్ట్రాల విషయానికొచ్చేసరికి నిబంధనలను మొత్తాన్నీ పక్కనబెట్టి అడిగినన్ని నిధులను మంజూరు చేస్తోందని, ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని ఉల్లంఘిస్తూ నిధులను సమీకరించుకొందని… ఇలా కేంద్రానికి, బిజెపి పాలిత రాష్ట్రాలకు ఒక రూలు… తెలంగాణ రాష్ట్రానికి వేరొక రూలు… అని తమ చేష్టలతో ఆర్.బి.ఐ., కేంద్రం వ్యవహరిస్తున్నాయని ఆ నాయకులు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News