- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బోర్డులోకి ఆనంద్ మహీంద్రా, రవీంద్ర ధోల్కియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్‌లను తీసుకుంది. ఈ నియామకాలు నాలుగేళ్ల పాటు ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. ఈ నియామకాలు జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. సెంట్రల్ బోర్డు డైరెక్టర్లచే రిజర్వు బ్యాంక్ వ్యవహారాలు నడుస్తాయి. ఈ బోర్డును ప్రభుత్వం నియమిస్తుంది. ఇది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం కింద నిర్వహిస్తారు. దిగ్గజం సంస్థ మహీంద్రా గ్రూప్‌కు ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Union Govt appoints Anand Mahindra on RBI Board
- Advertisement -