Friday, October 18, 2024

విమాన టికెట్ల ధరలను కేంద్రం నియంత్రించలేదు: రామ్మోహన్ నాయుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిర్ విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంపీలు ప్రయత్నించినపుడు టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఎపిలు చేసిన ఫిర్యాదుతోపాటు స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రస్తావనపై మంత్రి గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిచ్చారు.

చెన్నై-ఢిల్లీ రూట్‌లో ఎయిర్ విస్తారాలో టికెట్ బుక్ చేయడానికి తాను ప్రయత్నించిన ప్రతిసారి టికెట్ ధర దాదాపు రూ. 25,000 వరకు చూపుతోందని డిఎంకె సభ్యుడు దయానిధి మారన్ అనుబంధ ప్రశ్న వేశారు. అయితే తాను బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసే సమయానికి టికెట్ ధర మూడు రెట్టు పెరిగి ఉంటుందని ఆయన చెప్పారు. విస్తారా నిర్వహించే అదే టాటా గ్రూపునకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్ టికెట్ ధర పెరిగే విధంగా ఏదైనా టెక్నాలజీనివాడుతోందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లా మధ్యలో జోక్యం చేసుకుంటూ పలువురు ఎంపీల నుంచి తనకు కూడా ఇదే విషయమై ఫిర్యాదులు అండాయని తెలిపారు. ఎంపీల టికెట్ల ఖర్చు పార్లమెంట్ నుంచి వెళుతున్నందున దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఈ అంశంపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.

మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తాను పౌర విమానయాన మంత్రిత్వశాఖను చేపట్టిన నాటి నుంచి విమాన ప్రయాణం సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే విమాన టికెట్ల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవని ఆయన చెప్పారు. తమ మంత్రిత్వశాఖకు సంబంధించినంత వరకు కస్టమర్‌ను కింగ్‌గా భావిస్తామని, ప్రయాణికుల సౌకర్యాలకే ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు. భారతీయ లేదా విదేశీ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన టికెట్ల చార్ఝీలను ప్రభుత్వం నియంత్రించలేదని ఆయన తెలిపారు. సీజన్, సెలవులు, పండుగలు, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధర, పోటీతత్వం వంటి అనేక కారణాలు టికెట్ల ధరలపై ప్రభావం చూపుతాయని రామ్మోహన్ నాయుడు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News