Tuesday, September 17, 2024

గ్రామాల్లో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

Union Health Ministry guidelines for corona control in villages

 

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ , గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్రామీణప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ రేటు 30 శాతం వరకు నమోదౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం అన్ని రాష్ట్రాలకు గ్రామాల్లో కరోనా వ్యాప్తిని అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా అంటువ్యాధుల నివారణలో ఏయే జాగ్రత్తలు పాటిస్తామో అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవాలని, స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించింది.

•గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెంచాలి.

•ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

•కరోనా లక్షణాలున్న వారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్ వైద్య సేవలు అందించాలి.

•కరోనా బాధితుల్లో ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని జనరల్ ఆస్పత్రికి తరలించాలి.

•కొవిడ్ బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.

•రోగుల ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నవారిని ఆస్పత్రులకు తరలించాలి.

•గ్రామాల్లో సరిపడినన్ని ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు, అందుబాటులో ఉంచాలి. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారీ వాటిని శానిటైజ్ చేయాలి.

•దాదాసే 85 శాతం మందిలో కొవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. అలాంటివారు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందాలి.
ర్యాపిడ్ పరీక్షలపై పిఎన్‌ఎం, సిహెచ్‌ఒలకు శిక్షణ ఇవ్వాలి.

•అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి.

•కొవిడ్ బాధితులందరికీ హోమ్ ఐసొలేషన్ కిట్లు అందించాలి.

•కేసుల సంఖ్య, వైరస్ తీవ్రత బట్టి కాంటాక్టు ట్రేసింగ్ తప్పనిసరి చేయాలి.

•ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను ముమ్మరం చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News