Sunday, December 22, 2024

ఈ నెల్లో 7 రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన

- Advertisement -
- Advertisement -

Union Home Minister Amit Shah To Visit 7 States

మే 14న తెలంగాణకు.. రంగారెడ్డి జిల్లాలో బహిరంగసభలో ప్రసంగం

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్న మూడు వారాలలో దేశంలోని ఏడు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. తన పర్యటనల్లో ఆయన బహిరంగ సభలు, రాజకీయ సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటరాని అధికారులు గురువారం తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉన్న అమిత్ షా రానున్న మూడు వారాల్లో అస్సాం, తెలంగాణ, కేరళ, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లను సందర్శిస్తారు. మే 9,10 తేదీలలో ఆయన అస్సాంను సందర్శిస్తారు. ఆ రాష్ట్రంలో బిజెపి సారథ్యంలో ఏర్పడిన హిమంత బిస్వా శర్మ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మే 14న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరిగే ఈ సభలో షా ప్రసంగిస్తారు. మే 15న కేరళను సందర్శిస్తారు. మే 20న ఉత్తరాఖండ్‌లో, మే 21, 22 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్‌లో, మే 27న మహారాష్ట్రలో, మే 28, 29న గుజరాత్‌లో ఆయన పర్యటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News