Wednesday, January 22, 2025

రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయి సమావేశం గురువారం ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్ నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ శ్లోక కన్వెన్షన్ లో నిర్వహించే సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, సునిల్ బన్సల్, బిజెపి జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఇంచార్జ్, పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జావడేకర్ పాల్గొంటారని పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయం నుండి నోవాటెల్ హోటల్ చేరుకున్న అనంతరం అక్కడి నుండి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుండి కొంగర గ్రామానికి చేరుకొని బిజెపి రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.రాష్ట్ర స్థాయి సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు ఆపై స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొంటారని అసెంబ్లీ ఎన్నికల సమీక్ష , రానున్న పార్లమెంట్ ఎన్నికలు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలని సంకల్పిస్తూ వికాసిత్ భారత్(సంకల్ప యాత్ర), అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట(అయోధ్య సందర్శన) తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News