Thursday, January 9, 2025

ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ఈ నెల 12వ తేదీన తెలంగాణ పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు ఆపార్టీ నాయకులు 3 వేల మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి హాజరుకానున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఏ విధంగా పని చేయాలి, ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. 25 వేల మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గ్రామాల్లో ప్రతి బూత్‌లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్‌తో సమావేశమవుతారు. పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ సమావేశంలో 6 వేల మందితో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఏవిధంగా పని చేయాలి, పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అంశాలను వివరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News