Sunday, December 22, 2024

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

బీహార్ రాజకీయ పరిమాణాలతో వాయిదా పడట్లు పార్టీ వర్గాల వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉండగా పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందన్నారు. దీంతో కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ సమావేశాలను వాయిదా వేసినట్లు చెప్పారు. బీహార్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దయినట్లు ఆపార్గీ వర్గాలు వెల్లడించాయి.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వస్తారని తరువాత బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే అమిత్ షాను బిహార్ లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షా పర్యటన రద్దయ్యిందని, త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బిజెపి వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News