Friday, November 22, 2024

17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా విభజన సమస్యలపై చర్చించేందుకు ఈనెల 17న ఉదయం 11గంటలకు కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనాలని ఇరు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, పన్ను బకాయిలు,  బ్యాంకు డిపాజిట్ల చెల్లింపులు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్, రీసోర్సెస్ గ్యాప్, ఎపికి ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈనెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఏపి నుంచి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.

Union Home Ministry to held meeting on telugu states issues

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News