Monday, December 23, 2024

భారీ భద్రత నడుమ ఓటేసిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా

- Advertisement -
- Advertisement -

Union Minister Ajay Mishra voted amid heavy security

లఖింపుర్ ఖేరి : నిఘాసన్ అసెంబ్లీ నియోజక వర్గంలోని లఖింపుర్ ఖేరిలో బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా బుధవారం భారీ భద్రత మధ్య పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు, పారామిలిటరీ బలగాల భద్రత నడుమ లఖింపుర్ ఖేరిలోని భన్వారిపూర్‌లో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయం 11.30 గంటల సమయంలో ఆయన వెళ్లి ఓటు వేశారు. లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న తన కుమారుడికి సంబంధించి విలేఖర్లు ప్రశ్నించగా, విజయసంకేతం చూపుతూ ఆయన ముందుకు సాగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News