Monday, January 20, 2025

మార్చి 4వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో మార్చి 4వ తేదీన పర్యటించనున్నారు. బిజెపి చేపట్టిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన జరగాల్సిన అమిత్ షా పలు కారణాలతో పర్యటన రద్దు అయింది. దీంతో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఆపార్టీ 10 ఎంపీ సీట్లు గెలవాలని లక్షంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈ యాత్ర కోసం రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఐదు క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరగా హైదరాబాద్‌లో ముగించనున్నారు. ఈ యాత్రలో ఆ పార్టీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయసంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బిజెపి ప్లాన్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News