Sunday, December 22, 2024

ఈ నెల 17న కేంద్ర మంత్రి అమిత్‌షా బిజెపి మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17వ తేదీన ఆపార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ఎన్నికల పర్యాటనకు రానున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆపార్టీ సీనియర్లు వెల్లడించారు.

సోమాజిగూడలోని పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో అమిత్ షా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అనంతరం అమిత్ షా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో ప్రచారం వేగం పెంచారు. 17వ తేదీ ఒకేరోజు అమిత్ షా నాలుగు సభల్లో పాల్గొననున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News