Friday, December 20, 2024

రాహుల్ ఇటాలియన్ కళ్లద్దాలు తీసి చూడాలి: అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

Union Minister Amit Shah's satire on Rahul Gandhi

 

ఇటానగర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యంగ్యబాణాలు సంధించారు. ఎనిమిదేళ్లలో ఏం చేశారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, వీళ్లంతా మూసుకున్న కళ్లను తెరిచి చూడాలని హితవు పలికారు. రాహుల్ ఇటాలియన్ కళ్లద్దాలు ఒకసారి తీసి చూస్తే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి పెమా ఖండూ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. నమ్‌సాయి జిల్లా లోని రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్‌షా శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పన, శాంతిభద్రత పటిష్టత, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం తదితర పనులు ఎనిమిదేళ్లలో చేశాం. 50 ఏళ్లలో చేయలేని పనిని మోడీ, పెమాఖండూ కలిసి చేశారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News