Monday, December 23, 2024

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మెగాస్టార్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర క్రీడలు, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్‌లను కలిశారు. చిరంజీవి నివాసానికి వెళ్ళిన కేంద్రమంత్రి కాసేపు వారితో ముచ్చటించారు. ఈ సందర్బంగా సినీ పరిశ్రమ అభివృద్ధి, ఇతర రాజకీయ అంశాలను వారు చర్చించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో పోస్టు చేశారు.

హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీలు చూసుకుని తమ ఇంటికి వచ్చి కొంత సమయం గడిపినందుకు థ్యాంక్స్ అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతరత్రా విషయాల గురించి కేంద్రమంత్రితో చర్చించడం తనకెంతో అనందంగా ఉందని చిరంజీవి ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News