Sunday, January 19, 2025

లోక్ సభలో జమిలి బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి అర్జున్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్‌సభకు ముందుకు జమిలి బిల్లు వచ్చింది. లోక్ సభలో జమిలి బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జమిలి బిల్లుపై చర్చ జరుగుతోంది. జమిలి బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ, టిఎంసి, డిఎంకె, శివసేన, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. జమిలి బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ధ్వంసానికి బిడ్ వేస్తున్నారని ఎస్‌పి నేత ధర్మేంద్ర యాదవ్ పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వన్ నేషన్, వన్ ఎలక్షన్ వ్యతిరేకమన్నారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ధర్మేంద్ర పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని టిఎంసి ఎంపి కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు అని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్‌జెఎసి బిల్లును కూడా ఇలాగే ఆమోదించుకున్నారని, మౌలిక స్వరూపానికి ఎన్‌జెఎసి విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసిందని, జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే గతి పడుతుందని కల్యాణ్ బెనర్జీ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News