Thursday, December 19, 2024

బిజెపి వస్తే ధరణి రద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అది కుటుంబ పార్టీగా పేరుగాంచిదని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అమర్, అక్బర్, అంథోనిలా మారతారనని రాహుల్ అసలు నీది ఏ జాతి చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అవసరానికి తగినట్లుగా రూపం మార్చుకుంటాడని,అవినీతిపరులు, కమీషన్లు తీసుకునేవారిని, దేశాన్ని దోచుకునే వారిని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రధాని మోడీ బీసీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఆమాట ఖచ్చితంగా నెరవేరుస్తారని పేర్కొన్నారు.

గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ రూ. 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన దేశమంతా తిరుగుతూ దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. అవినీతిపరులతో ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయడంతో పాటు భూములను సర్వే చేసి అనంతరం డిజిటలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, మజ్లిస్ రంగ, బిల్లాలాగా మారాయని, కేంద్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌కు ఎప్పడు మద్దతు ఇవ్వలేదని, అదంతా విపక్ష పార్టీల రాజకీయ కుట్రలేనని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News