Monday, December 23, 2024

దుర్గాభవాని సన్నిధిలో కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

పాపన్నపేటః భక్తుల కొంగు బంగారు తల్లిగా విరాజిల్లుతున్న వనదుర్గాభవాని మాత సన్నిది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని వేద పండితులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రంగుల గాజులతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయలలో, చెక్‌డ్యాం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు అమ్మవారికి ఓడిబియ్యం, బోనాలు, తలనీలాలు సమర్పించి తమమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సౌకర్యాలు కల్పించారు. ఏడుపాయలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ తమ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.
దుర్గమ్మ సన్నిదిలో కేంద్ర మంత్రి
తెలంగాణలోనే రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను కేంద్ర పాడి పరిశ్రమ పశుసంవర్ద్దక, ఫిషరిష్ మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఆలయ ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు వనదుర్గాభవాని మాతను దర్శించుకుని ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. వీరికి ఈవో శ్రీనివాస్ శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట మెదక్ జిల్లా భాజపా పార్టీ అద్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అద్యక్షులు సంతోష్, సత్యనారాయణ, సుధాకర్, రాములు, కిష్టయ్య, బిక్షపతి, వివిధ గ్రామాల బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News